Tamil Film Producers council
-
టాలీవుడ్లో ‘అనువాదం’ పై వివాదం
అనువాద చిత్రాల వివాదం ముదిరేలా కనబడుతోంది. కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించే విషయమై, ఇతర సమస్యల గురించి చర్చలు జరపడానికి ఆ మధ్య తెలుగు సినిమాల షూటింగ్స్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరిగిందనే టాక్ వినిపించింది. అయితే ‘వారిసు’ తమిళ సినిమా కాబట్టి షూటింగ్ ఆపలేదని ‘దిల్’ రాజు పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ‘వారిసు’ తమిళ సినిమాయే అనే ముద్ర పడిపోయింది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారిసు’. ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కాగా సంక్రాంతి సందర్భంగానే నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే అనిల్ సుంకర నిర్మించిన ‘ఏజెంట్’ సంక్రాంతి రిలీజ్‌కే ముస్తాబు అయ్యింది. వీటితో పాటు తమిళంలో అజిత్ ‘తునివు’ కూడా సంక్రాంతి రిలీజ్‌కే రెడీ అవుతోంది. దాంతో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల థియేటర్ల సంఖ్య గురించిన అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి, దసరా పండగ సమయాల్లో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత అనువాద చిత్రాలకు థియేటర్స్ కేటాయించాలన్నట్లుగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ నోట్‌ను రిలీజ్ చేసింది. ఈ విషయంపై కొందరు తమిళ దర్శక–నిర్మాతలు అసహనంగా ఉన్నారని టాక్. ఒకవేళ తెలుగులో అనువాద చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే తమిళంలోనూ తెలుగు చిత్రాలకు థియేటర్లు కేటాయించ కూడదన్నట్లుగా కోలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు సంక్రాంతి, దసరా సీజన్స్‌లో డబ్బింగ్ సినిమాల విడుదలను ఆపడం అనేది జరిగే పని కాదని ‘తోడేలు’ ఈవెంట్లో అల్లు అరవింద్ పేర్కొన్నారు. ‘‘డబ్బింగ్ సినిమాల రిలీజ్‌లను ఆపాలని మేం ఎక్కడా చెప్పలేదు. సంక్రాంతి, దసరా సీజన్స్‌లో తొలి ప్రాధాన్యత తెలుగు చిత్రాలకు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్‌ను కోరుతూ లేఖ రాశాం’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. -
థియేటర్స్ క్లోజ్.. షూటింగ్స్ బంద్!
తమిళనాడులో ఈ నెల 16నుంచి థియేటర్స్‌ను క్లోజ్ చేస్తున్నట్లు తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలిపింది. ఈ బంద్ గురించిన మీటింగ్ చెన్నైలో జరిగింది. విశాల్, ప్రకాశ్‌రాజ్, నిర్మాత కదిరేశన్ తోపాటు పలువురు సినీప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేవలం థియేటర్స్‌ను మూయడం మాత్రమే కాదు షూటింగ్స్ని కూడా ఆపేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అలాగే, ఎలాంటి సినీ వేడుకలు జరపకూడదని కూడా నిర్ణయించారట. ‘‘నిర్మాతల శ్రేయస్సు కొరకు కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం. ఇవి పరిష్కారం అయ్యేవరకు సినిమా షూటింగ్‌లను కూడా నిలిపి వేయదలచాం’’ అని నిర్మాతల మండలి పేర్కొంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌తో పాటు, తమిళ్నాడు థియేటర్స్ అసోసియేషన్ కూడా కొన్ని డిమాండ్స్ చేసింది. ‘‘విజువల్ ప్రింట్ ఫీజును నిర్మాతలు (యూఎఫ్ఓ, క్యూబ్) డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు చెల్లించరు. ఫిల్మ్ స్టార్ వేల్యూను అనుసరించి టిక్కెట్ ధరల్లో మార్పులు ఉండాలి. ఆన్లైన్ టిక్కెట్ చార్జీలను తగ్గించాలి. కంప్యూటరైజ్డ్ టిక్కెట్ బుక్కింగ్ సౌకర్యాన్ని అన్ని «థియేటర్స్‌లో ఏర్పాటు చేయాలి. స్మాల్ స్కేల్ మూవీస్ రిలీజ్‌కు వెసులుబాటు కలిగించాలి’’ అని మరికొన్ని డిమాండ్స్ చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం కావడంతో బంద్ విరమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళ చిత్రసీమ బంద్‌కి పిలుపునిచ్చింది. ఈ నెల 16 లోపు తమ డిమాండ్స్‌ను అంగీకరిస్తే నిర్మాతల మండలి, థియేటర్స్ అసోసియేషన్ బంద్‌ను విరమించుకోవాలని అనుకుంటున్నారు. -
హీరో విశాల్‌కు ఊరట
చెన్నై: ప్రముఖ హీరో విశాల్‌కు ఊరట లభించింది. ఆయనపై తమిళ నిర్మాతల మండలి విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మద్రాస్ హైకోర్టు జోక్యంతో తమిళన నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది. తమిళ నిర్మాతల మండలి తీరును విమర్శిస్తూ విశాల్ పత్రికల్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా నిర్మాతల మండలి కార్యవర్గం లేఖ రాసింది. దీంతో విశాల్ వివరణ ఇచ్చాడు. ఈ వివరణతో సంతృప్తి చెందని నిర్మాతల మండలి అతడిపై తాత్కాలికంగా వేటు వేస్తూ తీర్మానం చేసింది. దీంతో విశాల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాను 2013 నుంచి చిత్ర నిర్మాణంలో ఉన్నానని, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, దురుద్దేశంతో నిర్మాతల మండలి నిర్వాహకులు చట్ట వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించారని పిటిషన్లో పేర్కొన్నాడు. తనపై విధించిన నిషేధాన్ని తొలగించేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు ఉత్తర్వుల మేరకు విశాల్‌పై సస్పెన్షన్‌ను నిర్మాతల మండలి ఎత్తివేసింది. -
విశాల్ ఎన్నికల్లో పోటీ చేస్తాడా?
చెన్నై: నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్‌కు తమిళ నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. తమిళ నిర్మాతల మండలి కార్యవర్గంపై నిరాధార ఆరోపణలు చేశారంటూ నటుడు విశాల్‌ను మండలి నుంచి తాత్కాలికంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో తనపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ నటుడు విశాల్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాధించిన నిర్మాతల మండలి తరఫు న్యాయవాది విశాల్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తే ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసే విషయం గురించి నిర్మాతల మండలి చర్చిస్తుందని పేర్కొన్నారు. నటుడు విశాల్ గత 4వ తేదీన నిర్మాతల మండలి గురించి తన వ్యాఖ్యలు వ్యక్తిగతం అని, అవి ఎవరినైనా బాధించినట్లయితే విచారం వ్యక్తం చేస్తున్నట్లు కోర్టుకు తెలియజేశారు. కాగా ఈ కేసు శుక్రవారం మరోసారి కోర్టులో విచారణకు వచ్చింది. నిర్మాతల మండలి తరఫు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ విశాల్‌పై నిషేధం ఎత్తివేసేందుకు మండలి నిరాకరించిందన్నారు. ఆయనను మండలి తాత్కాలికంగా బహిష్కరించినా విశాల్ ఆరోపణలు చేస్తూనే ఉండడం వల్ల నిషే«ధాన్ని కొనసాగించాలని, ఆయన విచారాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి తీర్మానంలో పేర్కొందని కోర్టుకు వివరించారు. న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా పిబ్రవరి 5న జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో తమ జట్టు పోటీ చేస్తుందని ఇప్పటికే వెల్లడించడమే గాకుండా అధ్యక్ష పదవికి నటి కుష్బూ పేరును కూడా ప్రకటించిన విశాల్‌కు ఇది షాక్ ఇచ్చే విషయమే. నిర్మాతల మండలి ఆయనపై బహిష్కరణను ఎత్తివేసినట్టయితే ఆయన రానున్న ఎన్నికల్లో తనకూ ఏదో ఒక ప్రధాన పదవికి పోటీ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడా అర్హత ఆయనకు లేదు. ఎందుకంటే ఈ నెల 8వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. మరి ఇలాంటి పరిణామాల్లో నటుడు విశాల్ తదుపరి చర్య ఏమిటన్నది వేచి చూడాల్సిందే. -
హీరో విశాల్‌కు హైకోర్టు నోటీసులు
చెన్నై: ప్రముఖ హీరో విశాల్ రిట్ పిటీషన్ దాఖలు చేయాల్సిందిగా మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకెళ్లితే తమిళ నిర్మాతల మండలి కార్యవ్యవహార ధోరణిని విమర్శిస్తూ విశాల్ పత్రికలకెక్కిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన నిర్మాతల మండలి కార్యవర్గం విశాల్ నుంచి వివరణ కోరుతూ లేఖ రాసింది. అయితే ఇచ్చిన వివరణ సంతృప్తి కలిగించకపోవడంతో అతడిపై తాత్కాలికంగా వేటు వేస్తూ తీర్మానం చేశారు. దీంతో విశాల్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. తాను 2013 నుంచి చిత్ర నిర్మాణంలో ఉన్నానని, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, దురుద్దేశంతో నిర్మాతల మండలి నిర్వాహకులు చట్ట వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించారని అతడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. తనపై విధించిన నిషేధాన్ని తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. ఈ కేసు సోమవారం న్యాయమూర్తి కల్యాణ సుందరం సమక్షంలో విచారణకు వచ్చింది. నిర్మాతల మండలి తరఫున హాజరైన న్యాయమూర్తి వాదిస్తూ ఈ కేసులో విశాల్ తన విచారాన్ని వ్యక్తం చేస్తే అతడిపై నిషేధాన్ని రద్దు చేయడానికి సిద్ధమని తెలిపారు. దీంతో విశాల్ తరఫున బదులివ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. -
ప్రశ్నించడమే నేరమా? : విశాల్
చెన్నై: ప్రశ్నించడమే నేరమా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని నటుడు, నిర్మాత, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అన్నారు. తమిళ నిర్మాతల సంఘం నిర్వాహకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై తాత్కాలిక సస్పెన్షన్ విధించినట్లు నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇది తనకు షాక్ అని భావించను గానీ, ఆశ్చర్యపరచిందన్నారు. తనకు నిర్మాతల సంఘం నుంచి అంతకు ముందు ఎప్పుడో ఒక లేఖ వచ్చిందనీ, అందులో సంఘం అధ్యక్షుడి పేరుగానీ, కార్యదర్శి పేరుగానీ లేదనీ, ఒక న్యాయవాది ద్వారా ఆ లేఖను పంపారనీ వివరించారు. అయినా ఒక నిర్మాతగా సహ నిర్మాతలకు మంచి జరగాలని కోరుకోవడం, వారి పక్కన నిలబడి ప్రశ్నంచడం నేరమా? అని ప్రశ్నించారు. తన సస్పెన్షన్‌ను చట్టబద్దంగా ఎదుర్కొంటానని, ఈ విషయంలో భయపడేది లేదనీ సోమవారం విలేకరుల సమావేశంలో విశాల్ తెలిపారు. నిజానికి తాను చేసిన నేరం ఏమిటో తనకు తెలియదన్నారు. అప్పుడెప్పుడో ఒక పత్రికకు ఇచ్చిన భేటీలో నిర్మాతల సంఘం నిర్వాహకులు నిర్మాతల శ్రేయస్సు గురించి పట్టించుకోవడం లేదనీ, బోండా, బజ్జీలు తింటూ కాలం గడిపేస్తున్నారని అన్నానని తెలిపారు. అలా అనడం తప్పని తాను భావించడం లేదని పేర్కొన్నారు. అదే తప్పు అయితే అంతకు ముందు అలాంటి వ్యాఖ్యల్నే నటుడు కరుణాస్ చేశారనీ, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అప్పట్లో నడిగర్ సంఘంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైతేనే తాను ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. పైరసీని అరికట్టే విషయంలో నిర్మాతల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ఈ విషయం లో చాలా మంది తనకు ఫోన్ చేసి అడుగుతున్నారన్నారు. అలాంటిది నిర్మాతల సంఘం నుంచి వస్తే తాను వారికి సహకరించగలనీ అన్నారు. నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తాం ఏ విషయంలోనైనా పోటీ ఉండాలన్నారు. జనవరిలో జరగనున్న నిర్మాతల మండలి ఎన్నికల్లో తన తరఫు నుంచి పోటీ ఉంటుందనీ విశాల్ వెల్లడించారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత విరోధాలు లేవనీ, నిర్మాతల సం ఘం అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను అంటే తనకు గౌరవమనీ తెలిపారు. అలాగని తనతో చిత్రం చేయమని ఆయన్ని అడగలేదనీ అన్నారు. ఎవరైనా నిర్మాతలు ఈ విషయంలో మద్దతు తెలిపారా? అన్న ప్రశ్నకు వ్యక్తిగతంగా తనకు ఎవరూ మద్దతు తెలపాల్సిన అవసరం లేదనీ, తన పోరాటంలో న్యాయం ఉందనిపిస్తే వారే మద్దతిస్తారనీ బదులిచ్చారు. -
కాజల్ అగర్వాల్‌పై ఉదయనిధి ఫిర్యాదు
హీరోయిన్ కాజల్ అగర్వాల్‌పై నిర్మాత, హీరో ఉదయనిధి స్టాలిన్ తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం ‘నన్బేణ్డా’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా తొలుత కాజల్ అగర్వాల్‌తో ఒప్పందం చేసుకుని రూ.40 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారు. కొన్ని అవాంతరాల వల్ల కాజల్ స్టానంలో నయనతార వచ్చారు. ఉదయనిధి, నయనతార జంటగా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. హీరోయిన్గా నటించనందున అడ్వాన్సుగా పుచ్చుకున్న మొత్తాన్ని వాపసు ఇవ్వాల్సిందిగా కాజల్‌ను ఉదయనిధి కోరారు. ఇందుకు నిరాకరించిన కాజల్ వచ్చే చిత్రంలో ఆ మొత్తాన్ని చెల్లింపు చేసుకొమ్మని బదులిచ్చారు. అనేక సార్లు ఒత్తిడి చేసినా అదే సమాధానం రావడంతో, కాజల్ అగర్వాల్ నుండి రూ.40లక్షలు ఇప్పించాల్సిందిగా కోరుతూ ఉదయనిధి స్టాలిన్ తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాడు. త్వరలో విచారణ జరగనుంది.