
సాక్షి, చెన్నై: త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లు తమిళ నటుడు విశాల్ ప్రకటించారు. 2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘ త్వరలో రాజకీయాల్లోకి వస్తా. 2026లో పార్టీ తరఫున నేను కూడా బరిలో దిగుతా. పార్టీ ఏర్పాటు, ఇతరత్రా వివరాలను త్వరలోనే వెల్లడిస్తా. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ 100 శాతం జరగాలని ఆశిస్తున్నా’’ అని విశాల్ చెప్పారు.