సత్తా చూపిస్తున్న అభిమన్యుడు | Vishal Abhimanyudu Collected 12 Crores In First Week | Sakshi
Sakshi News home page

సత్తా చూపిస్తున్న అభిమన్యుడు

Published Fri, Jun 8 2018 2:36 PM | Last Updated on Fri, Jun 8 2018 2:40 PM

Vishal Abhimanyudu Collected 12 Crores In First Week - Sakshi

విశాల్‌ చాలా ఏళ్ల తరువాత పెద్ద హిట్‌ కొట్టారు. పందెంకోడి లాంటి హిట్‌ తరువాత మళ్లీ ఆ రేంజ్‌లో హిట్‌పడలేదు. మాస్‌ ఇమేజ్‌ అంటూ ఒకే ధోరణిలో సినిమాలు చేస్తూ ఉన్న విశాల్‌ గతేడాది డిటెక్టివ్‌ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. కానీ​ ‘అభిమన్యుడు’ సినిమా ఆ లోటును తీర్చేస్తోంది. 

విడుదలైన రోజు నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తూ... విజయవంతంగా ఫస్ట్‌ వీక్‌ను కంప్లీట్‌ చేసుకుంది. మొదటి వారాంతానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ వారాంతంలో కూడా ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. సమంత, అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి హారిస్‌ జయరాజ్‌ సంగీతమందించగా, పీఎప్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించారు. విశాల్‌ ప్రస్తుతం పందెంకోడి2, టెంపర్‌ రీమేక్ మూవీలతో బిజీగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement