నేనూ రాజకీయాల్లోకి వస్తా: యంగ్‌ హీరో | Hero Vishal ready to enter into Politics | Sakshi
Sakshi News home page

నేనూ రాజకీయాల్లోకి వస్తా: యంగ్‌ హీరో

Published Fri, Sep 15 2017 7:36 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

నేనూ రాజకీయాల్లోకి వస్తా: యంగ్‌ హీరో - Sakshi

నేనూ రాజకీయాల్లోకి వస్తా: యంగ్‌ హీరో

చెన్నై: సినిమాలు రాజకీయాల చుట్టూ తిరడగం, రాజకీయాలు సినిమా వాళ్ల చుట్టూ తిరగడం పరిపాటే. అయితే ఈ పరిస్థితి తమిళ చిత్రపరిశ్రమలో కాస్త ఎక్కువ. ఇప్పటికే ప్రముఖ స్టార్‌ హీరోలు రజనీకాంత్‌, కమల్హాసన్‌ రాజకీయ రంగప్రవేశం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో విశాల్‌ రాజకీయాల్లో నా ఎంట్రీ షూరూ అంటున్నారు. ఇప్పటికే గట్టి పోటీ మధ్య దక్షిణభారత నటినటుట సంఘం ఎన్నికల్లోనూ, తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ గెలిచి సంచలనం సృష్టించారు విశాల్‌.​

తన అభిమాన సంఘం అయిన దేవీ ట్రస్ట్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విశాల్‌ హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం తుప్పరివాలన్‌ గురువారం విడుదలయ్యింది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఈయన పత్రికలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాల్‌ సేవా కార్యక్రమాలను ప్రస్థావిస్తూ రాజకీయ రంగ ప్రవేశం ఆలోచనతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ ఈ విషయంలో దాపరికాలు నాకు ఇష్టం లేదు. అధికారం ఉంటే ప్రజలకు మంచి చేయవచ్చు. మంచి చేయడమే రాజకీయం అయితే నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా’ నని ఆయన దృఢంగా అన్నారు.

ఈ కాలంలో కూడా చదువుకునే పిల్లలు ప్రభుత్వ పాఠశాలకకు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళుతున్నారన్నారు. వాళ్లకు సరైన వసతులు కల్పిస్తే పోయేదేముందని ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా వ్యాఖ్యానించారు. ఒక పక్క ఆర్థిక లోటు అంటూనే ఎమ్మెల్యే జీతాలు మాత్రం పలు రెట్లు పెంచుకున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రుణాలను మాఫీ చేశారనీ, తమిళనాడులో రైతులు  ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఆందోళన బాట పట్టినా రుణమాఫికి నిరాకరిస్తోందని చెప్పారు. రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ఉచిత​ విద్య, వైద్యాన్ని అందించాలని విశాల్‌ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement