మరో హీరోకు షూటింగ్‌లో గాయాలు
చెన్నై: సినీ హీరో విశాల్‌కు షూటింగ్‌లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన మిష్కిన్ దర్శకత్వంలో ‘తుప్పరివాలన్’ చిత్రంలో నటిస్తున్నారు. విశాల్ ఫిలిం ప్యాక్టరీ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా చిదంబరం సమీపంలోని పిచ్చాపరంలో జరుగుతోంది. చిత్ర యూనిట్... హీరో... శత్రువులతో పోరాడే దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.
కాగా సోమవారం విశాల్ పాల్గొన్న పోరాట దృశ్యలను చిత్రీకరిస్తుండగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన గాయపడగా, వెంటనే సమీపంలోని వైద్యులకు పిలిపించి వైద్య చికిత్స చేయించారు. ఈ సంఘటన గురించి చిత్ర యూనిట్ మాట్లాడుతూ... విశాల్ ఫైట్ సన్నివేశంలో అనూహ్యంగా కిందపడిపోయారని, పెద్దగా దెబ్బలేమీ తగల్లేదనీ చెప్పాయి. వైద్యుల విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారనీ, అయితే విశాల్ కొద్దిసేపటి తర్వాత షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిపాయి.