
సాక్షి, చెన్నై : తమిళ రాజకీయాల్లో మరో సంచలనం. యువ హీరో విశాల్ రెడ్డి రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేయటమే కాదు.. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు తమిళ మీడియా నుంచి వార్తలు అందుతున్నాయి.
అంతేకాదు కొత్త పార్టీ నెలకొల్పి 2021 ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నాడంట. సోమవారం విశాల్ ఆర్కే నగర్ ఉపఎన్నికలో తన నామినేషన్ వేయబోతున్నట్లు దాని సారాంశం. స్వతంత్ర్య అభ్యర్థిగా విశాల్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
కమల్, రజనీ రాజకీయ ఆరంగ్రేటంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో విశాల్ నిర్ణయం పెను చర్చకు దారితీసింది. కాగా, ఇప్పటిదాకా 27 నామినేషన్లు దాఖలు కాగా, విశాల్ ఎంట్రీతో ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారనుంది.