
సాక్షి, చెన్నై: దర్శకుడు శంకర్‌తో అమీ తుమి తేల్చుకోవడానికి లైకా సంస్థ సిద్ధమైనట్టు సమాచారం. ఈ సంస్థ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా ఇండియన్–2 చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2018లో చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం ఇంకా పూర్తి కాలేదు. దీనిపై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. చిత్రం షూటింగ్ ఆలస్యానికి లైకా సంస్థనేనని దర్శకుడు శంకర్ కోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. కేసు విచారణలో ఉంది.
దర్శకుడు శంకర్ తెలుగులో రామ్‌చరణ్ హీరోగా ఒకటి, హిందీలో రణబీర్‌సింగ్‌తో చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో లైకా సంస్థ తమ చిత్రా న్ని పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్‌ను తెలుగులో చిత్రం చేయడానికి అనుమ తించరాదని తెలుగు ఫిలిం ఛాంబర్‌కు, హిందీ ఫిలిం ఛాంబర్‌కు కూడా లేఖలు రాసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment