రోబో, ఐ, 2.ఓ లాంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది దర్శకుడు శంకర్. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ గ్రేట్ డైరెక్టర్ ఇటీవల కమర్షియల్ విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. వరుసగా నన్బన్ (3 ఇడియట్స్ రీమేక్), ఐ, 2.ఓ సినిమాలు నిర్మాతలకు నష్టాలు మిగల్చటంతో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న భారతీయుడు 2కు ఇబ్బందులు తప్పటం లేదు.
దేశంలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 2.ఓ సినిమాకు దాదాపు 100 కోట్ల నష్టం వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2ను తెరకెక్కిస్తున్నారు. దీంతో నిర్మాతలు శంకర్‌కు బడ్జెట్ పరంగా కండిషన్స్ పెడుతున్నారట. ఈ విషయంలోనే శంకర్‌కు నిర్మాతలకు మధ్య దూరం పెరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. శంకర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ తగ్గించేది లేదని, అవసరమైతే నిర్మాతలను మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతానికి భారతీయుడు 2 షూటింగ్ ఆపేశారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment