కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వివాదంలో విశాల్‌కు నేడు స్వల్ప ఊరట లభించింది. తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని, ఆ డబ్బు తిరిగి చెల్లించలేదని లైకా సంస్థ 2022లో మద్రాసు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ కేసుపై రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్‌ను గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అంత వరకు విశాల్ నిర్మించిన చిత్రాలను థియేటర్, ఓటీటీలలో విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది.
(ఇదీ చదవండి: వైరల్ అవుతున్న రకుల్ డ్రెస్.. అతను పట్టుకోవడంతో..!)
తాజాగా కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించారని, తమకు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన రూ. 15 కోట్లును ఇవ్వకుండానే పలు సినిమాలను నిర్మించారని, కోర్టు ధిక్కార కేసును లైకా దాఖలు చేసింది. ఈ కేసు ఈరోజు జడ్జి ఎస్.సెలాందర్ ముందు విచారణకు వచ్చింది. తమ సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలను నిర్మించలేదని విశాల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపి, తగిన ఆధారాలు చూపించారు. విశాల్ సినిమాలు నిర్మించినట్లు లైకా ప్రొడక్షన్స్ ఆధారాలు చూపించలేక పోయింది. దీంతో కేసును కోర్టు కొట్టి వేసింది. లైకా ప్రధాన కేసును జూన్ 26న విచారిస్తామని చెప్పి వాయిదా వేసింది.
(ఇదీ చదవండి: ఆమె తల్లి లాంటిది.. ఇలా ప్రచారం చేస్తారా?: ప్రభాస్ శ్రీను)
Comments
Please login to add a commentAdd a comment