‘లైకా’ చేతికి ‘అత్తారింటికి దారేది’! | Lyca Productions Got Rights For Tamil Remake Of Attarintiki Daredi | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 30 2018 5:38 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Lyca Productions Got Rights For Tamil Remake Of Attarintiki Daredi - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్‌ చేసింది. అప్పటివరకు ఉన్న రికార్డులన్నంటిని బద్దలు కొట్టింది.  సినిమా విడుదలకు ముందే పైరసీలో బయటకు వచ్చినా.. కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకెళ్లింది.  త్రివిక్రమ్‌, పవన్‌ కళ్యాణ్‌ స్టామినా ఏంటో మరోసారి ఈ సినిమా నిరూపించింది.

పవన్‌ నటన, త్రివిక్రమ్‌ మాటలు ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఇప్పుడు ఈ సినిమా తమిళ్‌లో రీమేక్‌ కాబోతోంది. ఈ మూవీ తమిళ్‌ రైట్స్‌ లైకా చేతికి వచ్చినట్లు.. అందుకు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు అంటూ ఈ సంస్థ ట్విటర్‌లో పేర్కొంది. తమిళ్‌ వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement