అమెరికాలో అత్తారింటికి కలెక్షన్ల జోరు | 'Attarintiki Daaredi' creates ripples at US box office | Sakshi
Sakshi News home page

అమెరికాలో అత్తారింటికి కలెక్షన్ల జోరు

Published Tue, Oct 1 2013 2:14 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

అమెరికాలో అత్తారింటికి కలెక్షన్ల జోరు - Sakshi

అమెరికాలో అత్తారింటికి కలెక్షన్ల జోరు

సగం సినిమా లీకేజి.. పైరసీ సీడీల హడావుడితో ఒక్కసారిగా సంచలనంగా మారిన 'అత్తారింటికి దారేది' సినిమా కేవలం మన దేశంలోనే కాదు.. అమెరికాలో కూడా కలెక్షన్ల విషయంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో 22 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. ఇక అమెరికాలో అయితే మొదటి వారాంతంలోనే 9.53 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే మొదటి మూడు రోజుల్లో మన రాష్ట్రంలో వచ్చిన వసూళ్లలో సగం మొత్తం అమెరికాలో కూడా వచ్చిందన్న మాట.

ఇప్పటివరకు అమెరికాలో ఉన్న రికార్డుల చరిత్రను 'అత్తారింటికి దారేది' తిరగరాసింది. సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ వారాంతంలో టాప్ 15 సినిమాల్లో దీనిదే అగ్రస్థానమని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. విదేశాల్లో హిందీ సినిమాలు మొత్తం తమ జీవితకాలంలో సాధించలేని మొత్తాన్ని అత్తారింటికి సినిమా మూడు రోజుల్లోనే సాధించిందని చెప్పారు. ఇది కేవలం తెలుగు సినీ పరిశ్రమకే కాదు.. హిందీ చిత్ర పరిశ్రమకు కూడా కళ్లు తెరిపించాలని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement