హీరోయిన్ రష్మికా మందన్న హీరో విక్రమ్‌కి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ‘2018’ అనే చిత్రం తెరకెక్కించారు డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్. ఈ సినిమా మలయాళంలో అద్భుత విజయాన్ని సాధించి బాక్సాఫీస్ కొత్త రికార్డులను సృష్టించింది. కాగా జూడ్ ఆంథోనీ జోసెఫ్ తన తర్వాతి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ లో చేయనున్నారు.
ఈ చిత్రంలో విక్రమ్ హీరోగా నటిస్తారని, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాత సుభాస్కరన్ సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇందులో హీరోయిన్ గా రష్మికా మందన్న, మాళవిక మోహనన్స్ పేర్లు వినిపించాయి. అయితే రష్మికా మందన్న ఫైనల్ అయ్యారని, అతి త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. విక్రమ్– రష్మిక జోడీ అధికారికంగా ఓకే అయితే... కార్తీ ‘సుల్తాన్ ’, విజయ్ ‘వారిసు’ చిత్రాల తర్వాత రష్మికా మందన్న నటించనున్న మూడో తమిళ సినిమా ఇదే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment