కోలీవుడ్‌లో చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాల వరకు కేరాఫ్‌గా మారిన చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షనన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇప్పుడు మాలీవుడ్లోకి అడుగు పెట్టారు. కంప్లీట్ యాక్టర్‌గా పేరుగాంచిన మోహన్‌లాల్ బహుభాషా నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు దశాబ్దాలుగా కథానాయకుడిగా నటిస్తూ మాలీవుడ్‌లో (మలయాళం) అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో ఈయన ఒకరు.
(ఇదీ చదవండి: వాళ్లు అయితే నా దుస్తులు తొలగించేవారు.. ఊసరవెల్లి బ్యూటీ కామెంట్లు)
350 చిత్రాలకు పైగా చేసిన మోహన్ లాల్ ఈమధ్య నటించిన చిత్రం లూసిఫర్. దీనికి మరో మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించి అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. లూసిఫర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా దానికి సీక్వెల్‌గా లూసిఫర్ 2 చిత్రం రూపొందుతోంది. ఇది కూడా మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్‌లో కాంబినేషన్‌లోనే తెరకెక్కడం విశేషం. కాగా విచిత్రాన్ని ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోని పెరంబలూర్‌తో కలిసి లైకా ప్రొడక్షనన్స్ సుభాస్కరన్ నిర్మిస్తుండడం మరో విశేషం.
దీని గురించి లైకా ఫిలిమ్స్ సంస్థ అధినేత సుభాస్కరన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ దైవ దేశంగా భావించే మలయాళ చిత్ర పరిశ్రమంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. అంకితభావంతో పనిచేసే కళాకారులు సహజత్వంతో కూడిన సంస్కృతికి అద్దం పట్టే చిత్రాలను రూపొందించే మలయాళ చిత్ర పరిశ్రమలో లూసిఫర్ 2 చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని తాము పొందామని చెప్పారు. ఈ చిత్త పరిశ్రమ అభివృద్ధిని, ఈ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ధ్యేయంగా పేర్కొన్నారు. ఈ చిత్ర విజయం పదికాలాలపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని సుభాస్కరన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment