
ఇటీవల రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్ తన కార్యచరణ ప్రారంభించారు. ఇప్పటికే ఆయనకు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలనుంచి కూడా పెద్ద ఎత్తున మద్దుతు లభిస్తోంది. లారెన్స్ లాంటి రజనీ అభిమానులు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించగా.. ఇప్పుడు మరో వ్యక్తి రజనీ తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యాడు.
ఇన్నాళ్లు లైకా ప్రొడక్షన్స్ సంస్థకు క్రియేటివ్ హెడ్‌గా పనిచేసిన రాజు మహాలింగం, లైకాకు రాజీనామా చేసి రజనీ పొలిటికల్ పార్టీ కోసం పనిచేయనున్నట్టుగా ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ రజనీ హీరోగా తెరకెక్కిస్తున్న ‘2 .ఓ’ సినిమాకు రాజు మహాలింగం పనిచేశారు. ఈ సినిమా సమయంలో రజనీ ఆలోచనలకు ఆకర్షితుడైన మహాలింగం రజనీతో కలిసి నడిచేందుకు అంగీకరించారు.
“A New REVOLUTION -A New POLITICAL WILL- A NEW YEAR ”- awaits for the people of TAMIL NADU!!! pic.twitter.com/5lJyDnir5i
— Raju Mahalingam (@rajumahalingam) 31 December 2017