Raju Mahalingam
-
రజనీ కోసం లైకాను వదిలేశాడు..!
ఇటీవల రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్ తన కార్యచరణ ప్రారంభించారు. ఇప్పటికే ఆయనకు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలనుంచి కూడా పెద్ద ఎత్తున మద్దుతు లభిస్తోంది. లారెన్స్ లాంటి రజనీ అభిమానులు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించగా.. ఇప్పుడు మరో వ్యక్తి రజనీ తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యాడు. ఇన్నాళ్లు లైకా ప్రొడక్షన్స్ సంస్థకు క్రియేటివ్ హెడ్‌గా పనిచేసిన రాజు మహాలింగం, లైకాకు రాజీనామా చేసి రజనీ పొలిటికల్ పార్టీ కోసం పనిచేయనున్నట్టుగా ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ రజనీ హీరోగా తెరకెక్కిస్తున్న ‘2 .ఓ’ సినిమాకు రాజు మహాలింగం పనిచేశారు. ఈ సినిమా సమయంలో రజనీ ఆలోచనలకు ఆకర్షితుడైన మహాలింగం రజనీతో కలిసి నడిచేందుకు అంగీకరించారు. “A New REVOLUTION -A New POLITICAL WILL- A NEW YEAR ”- awaits for the people of TAMIL NADU!!! pic.twitter.com/5lJyDnir5i — Raju Mahalingam (@rajumahalingam) 31 December 2017 -
రోబో 2.0 టీజర్ వేడుక హైదరాబాద్‌లోనే..
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నారు. అందులో ఒకటి రోబో 2.0. రూ.400 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని అణువణువూ చెక్కుతున్నారు. ఇందులో ఎమీజాక్సన్ కథానయికగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటేవలే ఒక్క పాట మినహా మొత్తం సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. దర్శకుడు శంకర్ ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రం విడుదల కోసం రజనీకాంత్ అభిమానులు ఎన్నో అంచనాలతో ఎదురు చూస్తున్నారు. వారి కోసం చిత్ర నిర్మాత, లైకా సంస్థ అధినేత రాజుమహాలింగం ఓప్రకటన చేశారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ అక్టోబరు నెల 27వ తేదీన దుబాయ్‌లోని బుర్జ్పార్క్లో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వేదికపై చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బ్రహ్మండ సంగీత కచ్చేరి ఉంటుందని చెప్పారు. అదే విధంగా టీజర్ రిలీజ్ వేడుకను నవంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ట్విట్లర్లో ప్రకటించారు. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ జన్మదినం రోజు డిసెంబర్ 12న చెన్నైలో 2.0. చిత్ర ట్రైలర్ విడుదల చేస్తామన్నారు. 2018 జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు రాజుమహాలింగం వెల్లడించారు. "Festivities to Begin" Come Oct -Audio Release in Dubai!!! Nov-Teaser in Hyderabad and Dec-Trailer in Namma Singara Chennai!!! 2.0 Loading!! — Raju Mahalingam (@rajumahalingam) September 7, 2017 -
బాహుబలి సక్సెస్ కంటే కూడా..!
బాహుబలి దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, తన వినయ విధేయతలతో అంతకన్నా ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నారు. దేశంలోనే ఘనవిజయం సాధించిన సినిమాకు దర్శకుడైనా.. రాజమౌళి ఎప్పుడు ఆ గర్వాన్ని చూపించరు. తనను కలిసిన సినీ ప్రముఖలతో సవినయంగా వ్యవహరించటం రాజమౌళికి అలవాటు. ఇదే విషయాన్ని తాజాగా ఓ తమిళ సినిమా ప్రముఖుడు వెల్లడించారు. దేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 2.0 సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం. ఇటీవల రాజమౌళిని కలిసిన మహాలింగం ఆసక్తికర ట్వీట్ చేశాడు. బాహుబలి సక్సెస్ కన్నా.. రాజమౌళి చూపించిన వినయమే గొప్పగా అనిపించింది అంటూ ట్వీట్ చేశాడు రాజు మహాలింగం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 2.0 ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్‌తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆరు నెలలకు పైగా సమయం కేటాయించారు. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న 2.0 సినిమాను 2018 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Met @ssrajamouli - realised his "Humility is BIGGER than the Mega Opus Success- Baahubali !!! Respect Sir!!! pic.twitter.com/LCaNQUiPK1 — Raju Mahalingam (@rajumahalingam) 8 July 2017