Dada: లైకా సంస్థ తిరస్కరించిన కథే! | Dada Movie Thanksgiving Meet Highlights | Sakshi
Sakshi News home page

Dada: లైకా సంస్థ తిరస్కరించిన కథే!

Published Wed, Feb 15 2023 10:09 AM | Last Updated on Wed, Feb 15 2023 10:10 AM

Dada Movie Thanksgiving Meet Highlights - Sakshi

తమిళ సినిమా: ఒలింపియా మూవీస్‌ పతాకంపై అంబేత్‌ కుమార్‌ నిర్మించిన చిత్రం డాడా. కవిన్, అపర్ణ దాస్‌ జంటగా నటించారు. కె.భాగ్యరాజ్, ఐశ్వర్య, గణేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గణేష్‌ కే బాబు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. నేటితరం యువత ప్రేమ నేపథ్యంలో రూపొందింది. ఈ నెల 10వ తేదీ విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సోమవారం సాయంత్రం చెన్నైలో థాంక్స్‌ గివింగ్‌ నిర్వహించారు.

కవిన్‌ మాట్లాడుతూ.. ఇది తన 12 ఏళ్ల కల అని పేర్కొన్నారు. చిత్ర యూనిట్‌ సమష్టి శ్రమకు దక్కిన విజయంగా పేర్కొన్నారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన నిర్మాత అంబేత్‌ కుమార్‌ను జీవితాంతం మరిచిపోనని దర్శకుడు గణేష్‌ కె బాబు పేర్కొన్నారు. నిర్మాత అంబేత్‌ కుమార్‌  మాట్లాడుతూ.. తాను అనుకోకుండా నిర్మాతగా మారి మనంకొత్తి పరవై, జిప్సీ చిత్రాలు చేశానన్నారు. చిన్న గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు డాడా చిత్రం చేసినట్లు చెప్పారు.

ముందు తాను వేరే కథ అనుకుని కవిన్‌ను వినమని చెప్పానన్నారు. అయితే ఆయన తన వద్ద ఒక కథ ఉంది.. మీరు విని బాగుంటే చేద్దామని చెప్పారన్నారు. అలా ఈ చిత్రం తెరరూపం దాల్చిందని చెప్పారు. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు, విడుదల చేసిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. విషయం ఏంటంటే ఈ చిత్ర కథను ముందు లైకా సంస్థ తిరస్కరించిందని, ఇప్పుడు అదే సంస్థ ఈ చిత్ర దర్శకుడికి అవకాశం కల్పించిందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement