పొరపాటు సరిదిద్దుకున్న 'భారతీయుడు 2'.. ఇదేదో ముందే చేసుంటే! | Kamal Haasan Bharateeyudu 2 Movie Run Time Trimmed By 20 Minutes, Deets Inside | Sakshi
Sakshi News home page

Bharateeyudu 2 Run Time: చేతులు కాల్చుకున్న భారతీయుడు తాతయ్య.. ఇప్పుడేమో?

Published Sat, Jul 13 2024 9:22 PM | Last Updated on Sun, Jul 14 2024 4:26 PM

Bharateeyudu 2 Movie Run Time Trimmed 20 Minutes

తప్పు జరిగిన తర్వాత కానీ సేనాపతి తాతయ్యకి ఎంత పొరపాటు జరిగిందో తెలిసీ రాలేదు. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'భారతీయుడు 2' తొలిరోజు తొలి ఆట నుంచే ఘోరమైన నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రారంభ షోలు చూసిన వాళ్ల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ తర్వాత మాత్రం టాక్ పూర్తిగా మారిపోయింది. చాలా తక్కువమంది మాత్రమే పాజిటివ్ అన్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే మూవీ టీమ్ పొరపాటు సరిదిద్దుకుంది.

యాక్షన్ సినిమాల్లాంటివి అంటే మూడు గంటలు చూస్తారు గానీ డ్రామా ఉండే సినిమాలు ఎంత క్రిస్పీగా ఉంటే అంత బెటర్. ఇలానే తను తీసిన సీన్లపై నమ్మకంతో దాదాపు 3 గంటల నిడివితో 'భారతీయుడు 2'ని డైరెక్టర్ శంకర్.. ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఇంత ల్యాగ్ ఏంట్రా బాబు అని చెప్పి అదే ఆడియెన్స్ సైడ్ చేసేశారు. దీంతో సినిమాలో అనవసరంగా అనిపించిన 20 నిమిషాల సన్నివేశాల్ని ఇప్పుడు తీసేశారు.

(ఇదీ చదవండి: Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ)

అలా 2 గంటల 40 నిమిషాల ఎడిట్ వెర్షన్‌ని ఆదివారం నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ న్యూస్ బయటకొచ్చిన వెంటనే.. నెటిజన్లు కూడా తలో రకంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ పనేదో ముందే చేసుంటే కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ అయ్యేదని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా చేతులు కాల్చుకున్న తర్వాత గానీ భారతీయుడు తాతయ్య ఆకులు గుర్తుకురాలేదు!

ఇదిలా ఉండగా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 'భారతీయుడు 2' సినిమాకు రూ.12 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెగిటివ్ టాక్, మరోవైపు సీన్లు తీసేసిన దృష్ట్యా ఆడియెన్స్ ఏ మేరకు థియేటర్లకు వెళ్తారనేది చూడాలి?

(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement