ఎట్టకేలకు భారతీయుడు తాత థియేటర్లలోకి వచ్చేశాడు. అప్పుడెప్పుడో 1996లో వచ్చిన సినిమాకు సీక్వెల్‌ని తాజాగా బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చేసింది. మరోవైపు ఈ చిత్ర ఓటీటీ పార్ట్‌నర్ ఎవరనేది కూడా క్లారిటీ వచ్చేసింది. అలానే స్ట్రీమింగ్ డేట్ కూడా ఇదే కావొచ్చని టాక్ కూడా వినిపిస్తోంది.
(ఇదీ చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే?)
కమల్ హాసన్ - శంకర్ కాంబోలో అప్పట్లో వచ్చిన 'భారతీయుడు'.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. తీసింది తమిళంలో అయినా తెలుగు డబ్బింగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక కొన్నేళ్ల క్రితం రెండో భాగాన్ని మొదలుపెట్టగా.. కొవిడ్, షూటింగ్ స్పాట్‌లో ప్రమాదం వల్ల ఏళ్లకు ఏళ్లు లేట్ అవుతూ వచ్చింది. చివరకు ఎలాగోలా పూర్తి చేసి ఇప్పుడు థియేటర్లలోకి తీసుకొచ్చారు.
సినిమా మరీ ల్యాగ్ ఉందని చూసొచ్చిన ప్రేక్షకులు అంటున్నారు. తాతయ్య మరీ విసిగించేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే 'భారతీయుడు 2' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. లెక్క ప్రకారం అయితే 6-8 వారాల తర్వాత రావొచ్చు. కానీ టాక్ తేడాగా వస్తుండటంతో 4-5 వారాల్లోపే వచ్చే అవకాశముంది. దీనిబట్టి చూస్తే ఇండిపెండెన్స్ డే వీక్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు)
Comments
Please login to add a commentAdd a comment