కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 1996లో విడుదలైన భారతీయుడు సూపర్ హిట్ దక్కించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ 2 జులై 12న విడుదలైంది. అయితే, సినిమా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు.
భారతీయుడు 2 సినిమాను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. కోలీవుడ్‌లో అత్యంత ఎక్కువ ధరతో ఈ సినిమా రైట్స్‌ను వారు తీసుకున్నట్లు సమాచారం. విడుదల సమయం నుంచి సుమారు 2 నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకురావలనే షరతుతో నెట్‌ఫ్లిక్స్ అగ్రిమెంట్ చేసుకుందట. వారి ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 12 తర్వాత ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. కానీ, సినిమా రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పటి వరకు కనీసం రూ.70 కోట్లు కూడా దాటలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో నిర్మాతలకు కూడా తీరని నష్టాన్ని ఇండియన్ 2 సినిమా మిగిల్చిందనే చెప్పవచ్చు.
భారతీయుడు 2 చిత్రాన్ని ఇప్పటికే చాలాచోట్ల తొలగించేశారు. ఓటీటీలో చూడొచ్చని ప్రేక్షకులు కూడా డిసైడ్ అయిపోయారు. దీంతో ఈ చిత్రాన్ని అగ్రిమెంట్ ప్రకారం కాకుండా నెలలోపే ఓటీటీలోకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందట. ఆగష్టు 2న భారతీయుడు 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ మంతనాలు జరుపుతుందట. ఈమేరకు అధికారికంగా త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment