కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా జులై 12న ఈ మూవీ విడుదలైంది. ఇందులో కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు. అయితే, సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదని చాలామంది క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సినిమాకు మొదటిరోజు కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టలేదని తేలుతుంది.
(చదవండి: : ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ)
ఇండియన్ 2 మూవీ తొలిరోజు రూ. 26.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళ్ వర్షన్‌లో రూ. 16 కోట్లు వస్తే.. తెలుగులో రూ. 8 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో అయితే మరీ దారణంగా కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్‌లో మొదటిరోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. శంకర్ లాంటి పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ సినిమాకు బాలీవుడ్‌లో ఇంత తక్కువ కలెక్షన్స్ రావడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
2022లో విడుదలైన విక్రమ్ సినిమా మొదటిరోజు రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, భారతీయుడు 2 మూవీ మాత్రం విక్రమ్ కలెక్షన్స్‌కు దరిదాపుల్లో కూడా చేరుకోలేకపోయింది. ఇదే క్రమంలో డైరెక్టర్ శంకర్ చివరి సినిమా రోబో 2.ఓ తొలిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లకు పైగా రాబట్టింది.
భారతీయుడు 2 సినిమా బాగాలేదంటూ ఇప్పటికే మోత్ టాక్ పబ్లిక్‌లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా తెలంగాణలో ఈ సినిమా టిక్కెట్ల ధరలు పెంచారు. ఈ ప్రభావం భారతీయుడు 2 కలెక్షన్ల మీద భారీగా పడనుంది. ఒక డబ్బింగ్ సినిమాకు టిక్కెట్ల ధరలు పెంచుకోవడం ఏంటి..? అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో సినిమా కదా చూసేద్దామని కుటుంబంతో వీకెండ్‌లో సినిమా ప్లాన్ చేసుకునే వారు కూడా భారతీయుడు వైపు వెళ్లకుండా చేసేలా టికెట్ల ధరలు ఉన్నాయిని నెటిజన్లు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment