భారతీయుడు 2 ఎండింగ్‌లో బిగ్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ | Bharateeyudu 2 Movie Climax After Bigg Surprise Plan | Sakshi
Sakshi News home page

భారతీయుడు 2 ఎండింగ్‌లో బిగ్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌

Published Thu, Jul 11 2024 4:03 PM | Last Updated on Thu, Jul 11 2024 4:37 PM

Bharateeyudu 2 Movie Climax After Bigg Surprise Plan

భారతీయుడు.. కమల్‌ హాసన్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఇన్నేళ్ల తర్వాత వారిద్దరి కాంబోలేనే భారతీయుడు 2 సీక్వెల్‌ రానుంది. జులై 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు.

'భారతీయుడు 2' సినిమా టికెట్లు ఆన్‌లైన్‌ పెట్టిన వెంటనే భారీగా అమ్ముడుపోతున్నాయి. వీటి ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 75 పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఫ్యాన్స్‌ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది. 

నాటికి, నేటికి సమాజంలో ఎలాంటి మార్పులు రాలేదని అందుకే పార్ట్‌ 2 నిర్మించామని కమల్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సమాజాన్ని పట్టిపీడించే అవినీతిపై పోరాటం గురించి పార్ట్‌ 1 లోనే తాను చెప్పాలనుకుంది చెప్పానని డైరెక్టర్‌ శంకర్‌ అన్నారు. పార్ట్‌ 2ని అందుకు భిన్నంగా తెరకెక్కించాలనే క్రమంలోనే కథ రాసేందుకు చాలా సమయం పట్టిందని ఆయన అ‍న్నారు.

భారతీయుడు 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో డైరెక్టర్‌ శంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదల సందర్భంగా కేరళలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్ కు బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. అందుకు అభిమానులు ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. భారతీయుడు 2 సినిమా ఎండ్ టైటిల్స్ తర్వాత ఇండియన్ 3 ట్రైలర్ చూపించబోతున్నట్లు నెట్టింట చర్చ జరుగుతుంది. 

పార్ట్‌ 3 చిత్రీకరణ కూడా ఇప్పటికే దాదాపు 70 శాతం పైగా జరిగినట్లు సమాచారం. ఎప్పుడో విడుదల కానున్న సినిమా ట్రైలర్‌ను ముందే విడుదల చేస్తున్నట్లు వార్తలు రావడంతో సినీ ప్రేమికులు సంతోషిస్తున్నారు. ఇలా భారతీయుడు 2 సినిమాలో పార్ట్‌ 3 ట్రైలర్‌ను విడుదల చేసి కమల్‌ ఫ్యాన్స్‌ను ఫిదా చేసే పనిలో డైరెక్టర్‌ శంకర్‌ ఉన్నారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement