'వేట్టైయాన్‌' సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఎంతంటే..? | Vettaiyan Movie Censor And Runtime Out Now | Sakshi
Sakshi News home page

'వేట్టైయాన్‌' సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఎంతంటే..?

Published Sat, Sep 28 2024 4:45 PM | Last Updated on Sat, Sep 28 2024 5:03 PM

Vettaiyan Movie Censor And Runtime Out Now

కోలీవుడ్‌ స్టార్‌ హీరో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'వేట్టైయాన్‌.' ఈ సినిమా సెన్సార్‌ ప్రక్రియను పూర్తి చేసుకుంది.  అమితాబ్‌ బచ్చన్, ఫాహద్‌ ఫాజిల్, రానా, మంజువారియర్, రిత్విక సింగ్, దుషారా విజయన్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జైభీమ్‌ చిత్రం ఫేమ్‌ టీజే. జ్ఞానవేల్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను అందించారు. అనిరుధ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ భారి ఎత్తున నిర్మించారు. 

నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈచిత్రం అక్టోబర్‌ 10న తెరపైకిరానుంది.  కాగా ఇందులో రజనీకాంత్‌ ఇందులో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటించారు. ఇటీవలే చిత్ర ఆడియోను అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. 

యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'వేట్టైయాన్‌' సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు యూనిట్‌ వర్గాలు పేర్కొన్నాయి. సినిమా రన్‌టైమ్‌ 2:47 గంటలు (167 నిమిషాలు) ఉన్నట్లు ప్రకటించింది. కాగా వేట్టైయాన్‌ చిత్రానికి ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌ మొదలైంది. ఓవర్సీస్‌లో కూడా బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement