
రానా పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'బాహుబలి'. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎప్పుడో ఒకటి అనేంతలా నటిస్తున్నాడు. రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'వేట్టయన్'లోనూ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా రానా గురించి స్వయానా రజినీకాంత్ ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు.
(ఇదీ చదవండి: టాలీవుడ్ దర్శకుడిదే తప్పు.. మానభంగం చేశాడు: పూనమ్ కౌర్)
'రానా.. రామానాయుడి మనవడిగా చిన్నప్పటి నుంచి తెలుసు. అప్పట్లోనే షూటింగ్‌కి వచ్చేవాడు. ఫుల్ జాలీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సీరియస్ లుక్ ఇచ్చేవాడు. అప్పుడు నిజంగా నేను భయపడేవాడిని' అని రజినీకాంత్ చెప్పుకొచ్చాడు. సూపర్‌స్టారే యాక్టింగ్ గురించి ప్రశంసించారంటే.. రానాకి ఇంతకంటే బెటర్ ఎలివేషన్ ఉండదేమో?
'జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'వేట్టయన్' సినిమాలో రజినీతో పాటు అమితాబ్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుసరా విజయన్.. ఇలా భారీ తారాగణం ఉంది. అనిరుధ్ ఇచ్చిన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అక్టోబరు 10న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: 7 నెలల తర్వాత ఓటీటీలోకి పూరీ తమ్ముడి సినిమా)
Imagine the level of Achievement when SUPER STAR himself talks something like this!🤯🤯🔥🔥🔥#RanaDaggubati #Vettaiyan #Rajinikanth pic.twitter.com/KMMKTrWa2s
— Filmy Bowl (@FilmyBowl) October 8, 2024