కోలుకున్న రజినీకాంత్.. 'వేట్టయన్' టీమ్‪‌తో ఇలా | Rajinikanth Health Update And Vettaiyan Collection | Sakshi
Sakshi News home page

Rajinikanth: అనారోగ్యం నుంచి కోలుకుని.. ఫిట్‪‌గా మారిన రజినీ

Oct 15 2024 1:20 PM | Updated on Oct 15 2024 1:35 PM

Rajinikanth Health Update And Vettaiyan Collection

సూపర్‌స్టార్ రజినీకాంత్.. కొన్నిరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి రావడంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తగ్గిపోతుందిలే అనుకున్నారు. కానీ అది సీరియస్ అయి, గుండెకి ఇబ్బందిగా మారింది. దీంతో డాక్టర్స్ స్టెంట్ వేశారు. ఇంతలోనే ఆయన నటించిన 'వేట్టయన్' సినిమా రిలీజైంది. తాజాగా మూవీ టీమ్ రజినీని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అలా రజినీ కొత్త ఫొటోలు బయటకొచ్చాయి.

(ఇదీ చదవండి: ఒకే వేదికపై ప్రభాస్‌,రజనీ,సూర్య.. ఎందుకో తెలుసా..?)

ఈ ఫొటోల్లో రజినీని చూస్తే అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు కనిపిస్తున్నారు. త్వరలో 'కూలీ' మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటారని తెలుస్తోంది. ఇకపోతే 'వేట్టయన్' చిత్రానికి 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగానే రజినీని చిత్రబృందం అంతా కలిసి విషెస్ చెప్పారు.

తమిళంలో 'వేట్టయన్'కి హిట్ టాక్ వచ్చింది. కానీ తెలుగులో మాత్రం మిశ్రమ స్పందన లభించింది. దసరా టైంలో అది కూడా నాలుగైదు చిత్రాలతో కలిసి రావడం తెలుగులో ఈ చిత్రానికి కాస్త మైనస్ అయింది. పండగకు రిలీజైన ఏ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకుల్ని సరిగా ఎంటర్‌టైన్ చేయలేకపోయింది.

(ఇదీ చదవండి: 'పుష్ప2' ప్రతి సీన్‌ ఇంటర్వెల్‌లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్‌)

Advertisement
 
Advertisement
Advertisement