'పుష్ప2' ప్రతి సీన్‌ ఇంటర్వెల్‌లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్‌ | Devi Sri Prasad Interesting Comments On Allu Arjun Pushpa 2 The Rule Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

Devi Sri Prasad On Pushpa 2: 'పుష్ప2' ప్రతి సీన్‌ ఇంటర్వెల్‌లా ఉంటుంది

Published Tue, Oct 15 2024 7:13 AM | Last Updated on Tue, Oct 15 2024 9:28 AM

Devi Sri Prasad Comments On Pushpa 2 Movie

అల్లు అర్జున్‌- సుకుమార్‌ల హిట్‌ కాంబోలో తెరకెక్కుతోన్న 'పుష్ప2' కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.  ఈ మూవీ గురించి ఏ వార్త కనిపించినా అది క్షణాల్లో వైరలవుతోంది. 'పుష్ప: ది రైజ్‌'కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే 'పుష్ప: ది రూల్‌' (పుష్ప 2). ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 19న దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌  గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 'పుష్ప 2' సినిమా ఎలా ఉందో చెప్పారు.

పుష్ప2 అదిరిపోతుంది: దేవిశ్రీ ప్రసాద్‌

పుష్ప పార్ట్‌ 2 'అస్సలు తగ్గేదే లే' అనేలా ఉండబోతుందని దేవిశ్రీ ప్రసాద్‌ అన్నారు. 'నేను పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చూశాను. సినిమా అదిరిపోయేలా వచ్చింది. ఇందులోని సీన్స్‌ అన్నీ చూశాక నా దిమ్మ తిరిగిపోయింది. పుష్ప వరల్డ్‌ ప్రారంభమయ్యాక ప్రతి సన్నివేశం ఇంటర్వెల్‌లా ఉంటుంది. ప్రేక్షకులను ఏమాత్రం నిరాశ పరిచేలా సీన్లు ఉండవు. దర్శకుడు సుకుమార్‌ స్క్రిప్ట్ చెప్పినప్పుడే తెగ నచ్చేసింది. అంతే స్థాయిలో దానిని తెరకెక్కించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన స్టైల్లొ అదరగొట్టేశాడు.' అని మూవీపై భారీ అంచనాలు పెంచేశాడు. పుష్ప2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించారు. డిసెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

హైదరాబాద్‌లో తొలిసారి మ్యూజికల్‌ కాన్సర్ట్‌ను దేవిశ్రీ ప్రసాద్‌ నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 19న గచ్చిబౌలి స్టేడియంలో  ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే  విదేశాల్లో ఇలాంటి ఎన్నో ప్రదర్శనలిచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌.. తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటంతో ఫ్యాన్స్‌ సంబర పడుతున్నారు. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పాల్గొననున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement