దసరా పండక్కి థియేటర్స్‌లోకి రానున్నాడు ‘వేట్టైయాన్ ’. రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్‌పై ఈ మూవీని సుభాస్కరన్ నిర్మించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’ అనే సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.
అయితే, వేట్టైయాన్ ప్రమోషన్స్‌లో భాగాంగా తాజాగా ప్రివ్యూ పేరుతో ఒక టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అనిరుధ్ ఫ్లాష్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో దుమ్మురేపాడు. టీజర్‌లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ ఇతర పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment