వేట్టయాన్‌లో నానికి ఆఫర్‌ ఆ రోల్.. చివరికీ! | Nani reportedly declined an offer to act in Rajinikanth Vettaiyan | Sakshi
Sakshi News home page

Rajinikanth Vettaiyan: వేట్టయాన్‌లో నానికి కీలక పాత్ర.. కానీ!

Published Tue, Oct 15 2024 6:57 PM | Last Updated on Tue, Oct 15 2024 8:03 PM

Nani reportedly declined an offer to act in Rajinikanth Vettaiyan

సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో టాలీవుడ్‌ హీరో నానికి ఓ పాత్ర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నాని ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే నాని ప్లేస్‌లో పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్‌ను ఎంపిక చేశారు.    

అయితే నాని నిర్ణయంపై అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. కానీ వీరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీనిపై ఓ అభిమాని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా నుంచి నాని తప్పించుకున్నాడని రాసుకొచ్చారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement