'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' ట్విటర్‌ రివ్యూ | Arjun son of Vyjayanthi Twitter Review | Sakshi
Sakshi News home page

'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' ట్విటర్‌ రివ్యూ

Published Fri, Apr 18 2025 8:00 AM | Last Updated on Fri, Apr 18 2025 12:22 PM

Arjun son of Vyjayanthi Twitter Review

విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) నేడు (ఏప్రిల్‌ 18) విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికే ఓవర్సీస్‌లో బొమ్మ పడింది. నూతన దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఈ మాస్‌ చిత్రంతో డైరెక్టర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై అశోక్‌ వర్ధన్‌, సునీల్‌ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చాటి చెప్పేలా అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చిత్రం ఉందంటూ అభిమానులు చెబుతున్నారు.

ఓవర్సీస్‌లో ఇప్పటికే అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి ఫస్టాఫ్‌ పూర్తి అయిందని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి యాక్టింగ్‌ పోటీపడి నటించారని చెబుతున్నారు. చాలారోజుల తర్వాత విజయశాంతిని మళ్లీ ఇలా పోలీస్ ఆఫీసర్‌గా చూడటం చాలా సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ స్టోరీగా సినిమా ఉందంటున్నారు.. అయితే, కొన్ని  యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయంటున్నారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆ సన్నివేశాలకు మరింత బలాన్ని అందించాయని తెలుపుతున్నారు. 

ఫస్టాఫ్‌ వరకు కథాంశంలో ఎటువంటి ఆశ్చర్యకరమైన మలుపులు వంటివి లేవని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఇలాంటి స్టోరీస్‌తో చాలా సినిమాలు వచ్చాయని అంటున్నారు. ఎన్టీఆర్‌ నటించిన జనతా గ్యారేజ్‌ చిత్రానికి దగ్గరగా అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి స్టోరీ ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.  ఇంటర్వెల్ బ్లాక్స్‌లో కల్యాణ్‌రామ్‌, విలన్‌ల మధ్య వచ్చే భారీ యాక్షన్‌ సీన్‌ అదుర్స్‌లా ఉంటుందని ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు అయితే, ఫస్టాఫ్‌ పూర్తి అయింద పెద్దగా కొత్తదనం ఏమీ లేదంటున్నారు. కానీ, యాక్షన్‌ సినిమాలు ఇష్టపడేవారిని ఈ చిత్రం ఎంతమాత్రం నిరాశపరచదని ఎక్కువమంది చెప్పడం విశేషం.

ఇక ఇంటర్వెల్‌ తర్వాత ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని అంటున్నారు. కొడుకు కోసం తల్లి పడే ఆరాటం ఎలా ఉంటుంది ఈ చిత్రంలో చూడొచ్చన్నారు. అదే సమయంలో అమ్మ కోసం కొడుకు చేసే పోరాటాన్ని కూడా ఇందులో చూస్తారని చెబుతున్నారు.  ఫస్ట్ హాఫ్ రొటీన్‌గా సాగడం.. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు మరీ ఎక్కువగా సాగదీసినట్లు ఉండడం ఈ చిత్రంలో మైనస్ అని పేర్కొంటున్నారు.  పెద్దగా ట్విస్ట్‌లు ఏమీ లేకున్నా తల్లి కొడుకుల సెంటిమెంట్, పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో మెప్పించారని నెటిజన్లు తెలుపుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌ సమయంలో చెప్పినట్లు క్లైమాక్స్‌ సీన్‌కు చాలామంది ఎమోషనల్‌ అవుతారని తెలుపుతున్నారు. సినిమా తప్పకుండా భారీ విజయం అందుకుంటుందని చెబుతున్నారు. పూర్తి రివ్యూ కోసం ఇంకాస్త సమయం పడుతుంది. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement