
జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన చిత్రం 'డియర్'. నట్ మెగ్ ఫ్రాడక్షన్‌న్స్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జీ.పృథ్వీరాజ్ కలిసి నిర్మించారు. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఇళవరసు, నటి రోహిణి, గీతా కై లాసం, తలైవాసల్ విజయ్, బ్లాక్‌షిప్ నందిని ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జీవీ. ప్రకాష్‌కుమార్ సంగీతమందించగా.. జగదీష్ చంద్రమూర్తి ఛాయాగ్రహణం అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
(ఇది చదవండి: బుల్లితెర నటుడి నిశ్చితార్థం.. వీడియో వైరల్)
ఈ చిత్ర విడుదల హక్కులను రోమియో పిక్చర్స్ సంస్థ పొందడం విశేషం. ప్రముఖ చిత్రం నిర్మాణ సంస్థగా పేరు గాంచిన రోమియో పిక్చర్స్ అధినేత పలు విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారన్నది గమనార్హం. ఇంతకుముందు నేర్కండ పారువై, వలిమై, నెంజుక్కు నీతి, వీట్ల విశేషం, ట్రిక్కర్, తుణివు, డైనోసర్స్ వంటి పలు విజయవంతమైన చిత్రాలు విడుదలయ్యాయి. కాగా ఈ సంస్థ తాజాగా డియర్ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతకుముందు చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు ఓ ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు.
(ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. జగదేకవీరుడు.. అతిలోకసుందరి నటుడు మృతి! )
#DeAr - Tamil Nadu theatrical rights bagged by #RomeoPictures. Get ready for exciting updates soon!#DearWithRomeoPictures @aishu_dil @mynameisraahul @tvaroon @NutmegProd @Anand_Rchandran #AbhishekRamisetty @jagadeesh_s_v @editor_rukesh @narentnb @proyuvraaj pic.twitter.com/B9q4BJkcqS
— G.V.Prakash Kumar (@gvprakash) August 31, 2023