dear
-
DeAr Movie Review : గురక కాన్సెప్ట్‌తో వచ్చిన ‘డియర్’ ఎలా ఉందంటే?
టైటిల్: డియర్నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, ఇలవరసు, రోహిణి, కాళి వెంకట్, తలైవసల్ విజయ్, నందిని, గీతా కైలాసం తదితరులునిర్మాతలు: జీ పృథ్వీ కుమార్, అభిషేక్ రామిశెట్టి, వరుణ్ త్రిపురనేనిదర్శకత్వం: ఆనంద్ రవించంద్రన్సంగీతం: జీవీ ప్రకాశ్విడుదల తేది: ఏప్రిల్ 12, 2024అర్జున్(జీవీ ప్రకాశ్ కుమార్) ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్. ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అవ్వాలనేది అతని కల. కానీ అతని అన్నయ్య చరణ్(కాళి వెంకట్), అమ్మ లక్ష్మీ(రోహిణి) మాత్రం అర్జున్‌కి పెళ్లి చేయాలని ఫిక్స్ చేస్తారు. ఓ మంచి సంబంధం చూస్తారు. అమ్మాయి పేరు దీపిక(ఐశ్వర్య రాజేష్). ఆమెకు గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఈ విషయాన్ని దాచి అర్జున్‌ని పెళ్లి చేసుకుంటుంది. అర్జున్‌కి ఏమో నిద్రపోయినప్పుడు చిన్న శబ్దం వినిపించినా.. లేచి కూర్చునే అలవాటు. వీరిద్దరికి ఉన్న విభిన్నమైన అలవాట్లు.. వారి కాపురంలో కలతలు తెచ్చిపెడతాయి. అర్జున్ ఉద్యోగానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? భార్య పెట్టే గురక వల్ల అర్జున్‌కి ఎలాంటి సమస్యలు వచ్చాయి? విడాకుల వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొత్త పాయింట్‌తో ఓ సినిమా వచ్చి..అది సూపర్ హిట్ అయిన తర్వాత అలాంటి కాన్సెప్ట్‌తోనే మళ్లీ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? పాత కథే అయినా తెరపై కొత్తగా చూపిస్తే కొంతలో కొంత ఆదరించే అవకాశం ఉంటుంది. కానీ హిట్ సినిమా కాన్సెప్ట్ తీసుకొని.. అతి సాధారణంగా కథనాన్ని నడిపిస్తే ఎలా ఉంటుంది? ‘డియర్’ మూవీలా ఉంటుంది. గురక సమస్యతో అల్రేడీ ‘గుడ్‌నైట్’ అనే సినిమా వచ్చి.. ప్రేక్షకులను మనసును దోచుకుంది. అలాంటి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కిన మూవీ ‘డియర్’.‘గుడ్‌నైట్’లో హీరోకి గురక సమస్య ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌కి ఉంటుంది. అంతే తేడా. కానీ గుడ్‌నైట్ సినిమాలో వర్కౌట్ అయిన ఎమోషన్ ఈ చిత్రంలో కాలేదు.. కథనాన్ని అటు వినోదాత్మకంగాను..ఇటు ఎమోషనల్‌గాను మలచడంతో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యాడు. సినిమాలో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. గురక సమస్యను అధిగమించేందుకు హీరో తీసుకునే నిర్ణయం సిల్లీగా అనిపిస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు చాలా మార్గాలే ఉన్నా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది. పైగా మధ్యలో హీరో పేరేంట్స్ సంబంధించిన స్టోరీని తీసుకొచ్చారు.పోనీ అదైనా కొత్తగా ఉందా అంటే.. అరగదీసిన ఫార్ములానే మళ్లీ వాడేశారు. ఏ దశలోను కథనం ఆసక్తికరంగా సాగదు. హీరోహీరోయిన్లకు ఉన్న సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోయిన్‌కి గురక పెట్టే సమస్య.. హీరోకి పెన్సిల్ కిందపడిన శబ్దం వినించినా నిద్రలేచే అలవాటు. ఈ ఇద్దరికి ఉన్న సమస్యల మధ్య బోలెడంత కామెడీ పండించొచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. పోనీ ఎమోషనల్‌గా అయినా చూపించారా అంటే అదీ లేదు. తమకున్న సమస్యలను దాచి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడం.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయడం.. ఇవన్నీ రొటీన్‌గా ఉంటాయి. ఇక హీరో ఉద్యోగం పోవడానికి గల కారణం బాగున్నా..దానికి సంబంధించిన సన్నివేశాలు అయితే సిల్లీగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త ఆస్తకరంగా అనిపించినా.. సెకండాఫ్ మరింత సాగదీతగా ఉంటుంది. పేరెంట్స్‌ని కలిపే ఎపిసోడ్ మెయిన్ కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. గుడ్‌నైట్ సినిమా చూడనివారిని ఈ సినిమా కాస్త అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్‌గా జీవీ ప్రకాశ్ చక్కగా నటించారు. అయితే ఆయన పాత్రను బలంగా తిర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. దీపిక పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించింది. హీరో తల్లిగా రోహిణిది రొటీన్ పాత్రే. కాళీ వెంకట్, ఇళవరసుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు సోసోగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అర్జున్‌కి కనెక్ట్ అయ్యా!
‘‘ఓపెన్ చేస్తే వైజాగ్‌లో అందమైన ఇల్లు...’’ అంటూ నాగచైతన్య ఇచ్చిన వాయిస్ ఓవర్‌తో మొదలైంది ‘డియర్’ చిత్రం ట్రైలర్. జీవీ ప్రకాశ్‌కుమార్, ఐశ్వర్యా రాజేశ్ నటించిన చిత్రం ‘డియర్’. తమిళంలో ఈ నెల 11న, తెలుగులో 12న ఈ చిత్రం విడుదల కానుంది. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి. పృథ్వీరాజ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంధ్రాలో అన్నపూర్ణ స్టూడియోస్, తెలంగాణలో ఏషియన్ సినిమాస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. భార్య (ఐశ్వర్యా రాజేశ్) గురక కారణంగా భర్త (జీవీ ప్రకాశ్) సతమతమవుతుంటాడు. ఆ గురక కారణంగా వారి అనుబంధంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది ‘డియర్’ కథాంశం. ‘‘ఈ ప్రపంచంలో నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా? రాత్రిపూట మంచి నిద్ర. ఈ కథను (‘డియర్’కి ఇచ్చిన వాయిస్ ఓవర్‌ని ఉద్దేశించి) నెరేట్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. అర్జున్ (జీవీ ప్రకాశ్ పాత్ర) భయానికి నేను కనెక్ట్ అయ్యాను. మీరూ కనెక్ట్ అవుతారనుకుంటున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో ‘డియర్’ ట్రైలర్‌ని షేర్ చేశారు నాగచైతన్య. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. -
భార్య గురక పెడితే... ఫన్నీగా సినిమా ట్రైలర్
జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'డియర్'. తమిళంలో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. నాగ చైతన్య వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రయిలర్ నూతన వధూవరుల పాత్రల్లో జివి ప్రకాష్ కుమార్ , ఐశ్వర్య రాజేష్ లైఫ్ లో స్నీక్ పీక్ ఇస్తుంది. గుడ్‌నైట్ సినిమాలో భర్తకు గురక ఉంటే ఇక్కడ భార్యకు గురక ఉంది. ఈమె గురక అలవాటు కారణంగా రిలేషన్ షిప్ కాంప్లికేటెడ్ గా మారిన కథాంశం సరికొత్తగా అనిపిస్తుంది. నాగ చైతన్య వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. జగదీష్ సుందరమూర్తి కెమెరా బ్రిలియంట్ గా వుంది. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామిక్ కోణాన్ని ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ ప్రాంతంలో విడుదల చేయనుంది. డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలక పాత్రలలో నటించారు. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న మరో తెలుగమ్మాయి..!
టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు ఎంతమంది ఉన్నారంటే వేళ్లమీదే లెక్క పెట్టేస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీలో తెలుగు చాలా అరుదుగా హీరోయిన్లుగా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగమ్మాయిలు సైతం సినీ పరిశ్రమలో దూసుకెళ్తున్నారు. తాజాగా మరో తెలుగమ్మాయి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. అనంతపురానికి చెందిన తెలుగు అమ్మాయి సుమయారెడ్డి మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. సినిమాల్లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. సుమయ తన తొలి చిత్రం డియర్ ఉమ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. పృథ్వీ అంబర్తో కలిసి నటించిన ఈ చిత్రానికి రచయితగా, నిర్మాతగా కూడా వ్యవరిస్తున్నారు. ఈ మూవీ కోసం విభిన్నమైన క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తూ మల్టీ టాలెంట్‌ను పరిచయం చేస్తున్నారు. సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సాయి రాజేష్ మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా.. త్వరలోనే చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. Clicks from the Opening Muhurtham Ceremony of @sumachitraarts Production No.1 #DearUma 🎥 🌟 @AmbarPruthvi & @sumaya_reddy 🎬 #SaiRajeshMahadev Releasing in Telugu, Hindi, Tamil, Malayalam & Kannada. pic.twitter.com/oLKqYyFHLo — Indian Clicks (@IndianClicks) May 21, 2023 -
ఐశ్వర్య రాజేశ్ తాజా చిత్రం.. హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన చిత్రం 'డియర్'. నట్ మెగ్ ఫ్రాడక్షన్‌న్స్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జీ.పృథ్వీరాజ్ కలిసి నిర్మించారు. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఇళవరసు, నటి రోహిణి, గీతా కై లాసం, తలైవాసల్ విజయ్, బ్లాక్‌షిప్ నందిని ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జీవీ. ప్రకాష్‌కుమార్ సంగీతమందించగా.. జగదీష్ చంద్రమూర్తి ఛాయాగ్రహణం అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: బుల్లితెర నటుడి నిశ్చితార్థం.. వీడియో వైరల్) ఈ చిత్ర విడుదల హక్కులను రోమియో పిక్చర్స్ సంస్థ పొందడం విశేషం. ప్రముఖ చిత్రం నిర్మాణ సంస్థగా పేరు గాంచిన రోమియో పిక్చర్స్ అధినేత పలు విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారన్నది గమనార్హం. ఇంతకుముందు నేర్కండ పారువై, వలిమై, నెంజుక్కు నీతి, వీట్ల విశేషం, ట్రిక్కర్, తుణివు, డైనోసర్స్ వంటి పలు విజయవంతమైన చిత్రాలు విడుదలయ్యాయి. కాగా ఈ సంస్థ తాజాగా డియర్ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతకుముందు చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు ఓ ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. జగదేకవీరుడు.. అతిలోకసుందరి నటుడు మృతి! ) #DeAr - Tamil Nadu theatrical rights bagged by #RomeoPictures. Get ready for exciting updates soon!#DearWithRomeoPictures @aishu_dil @mynameisraahul @tvaroon @NutmegProd @Anand_Rchandran #AbhishekRamisetty @jagadeesh_s_v @editor_rukesh @narentnb @proyuvraaj pic.twitter.com/B9q4BJkcqS — G.V.Prakash Kumar (@gvprakash) August 31, 2023 -
హీరోగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. అలాంటి కాన్సెప్ట్!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, నటి ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'డియర్'. నట్ మెగ్ ప్రొడక్షన్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఆయిరమ్' ఫేమ్ ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. కాళీ వెంకట్, ఇళవరసు, రోహిణి, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా 'డియర్' షూటింగ్ తాజాగా పూర్తి చేసుకుంది. 35 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసినట్లు నిర్మాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'డియర్' స్టోరీ, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉన్నాయని అన్నారు. జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ కలిసి తొలిసారిగా నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం, చిత్ర విడుదల తేదీని వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) -
ఎర్రగులాబి
‘‘గుడ్ మార్నింగ్... నమస్తే.. ఆదాబ్.. నేను సూపర్ కూల్.. మీరు వింటున్నారు రేడియో నీమ్.. ఇది చాలా చేదు బాస్. యే డైట్ అయినా షుగర్‌కి నో అంటోంది కాని బిట్టర్కి కాదు. బిట్టర్ ఎంత బెస్టో తెలుసా! చేదుకు అలవాటు పడితే.. ఎంతటి కషాయాన్నయినా.. ఐ మీన్ ఎంతటి కష్టాన్నయినా ఇట్టే మింగేయొచ్చు’’ సాగుతోంది నాన్‌స్టాప్‌గా!మొబైల్ ఫోన్లో మెసేజెస్ బ్లింక్ అవుతూన్నాయి. ఆసక్తి..అనాసక్తి..వంటివేవీ ప్రదర్శించకుండా తన పనిలో నిమగ్నమైంది ఆ గొంతు. షో తర్వాత ఫోన్ చూసుకుంటే... ‘‘హేయ్..! వెన్ విల్ వి మీట్’’ మెసేజే రిపీటెడ్‌గా ఉంది. డయల్ చేయబోతుండగానే.. రింగ్ అయింది.. ‘‘భైరవా..’’‘‘హాయ్.. ’’ ఆత్రం, ప్రేమ, మార్దవంగా భైరవ. ‘‘సారీ.. ఇందాక షోలో ఉండి రిప్లయ్ ఇవ్వలేదు’’‘‘ఓహ్.. సారీ డిస్టర్బ్ చేసినందుకు.. ’’నొచ్చుకుంటూ భైరవ. ‘‘కమాన్ మ్యాన్.. డోంట్ బీ ఫార్మల్’’‘‘అయితే.. చెప్పు.. ఎప్పుడు కలుస్తున్నావ్?’’‘‘అప్పుడే ఎందుకంత తొందర? కలుద్దాం’’ నింపాదిగా!‘‘ హే.. ఇట్స్ బీన్ ఎ మంత్.. డార్లింగ్?’’ భైరవ‘‘అందుకే అంత తొందరా అంటున్నా..’’‘‘హలో బేబీ.. ఇది మిలేనియల్స్ ఏజ్. నిన్న కలిసి.. ఈ రోజు ప్రేమించుకుని.. రేపు బ్రేకప్ చేసుకునేంత స్పీడ్..’’‘‘ఆహా... ’’‘‘యెస్ బేబీ!చచ్చిపోతున్నా.. నరకం కనపడుతోంది.. వినిపించడం తప్ప కనిపించవు’’. ‘‘కమా...న్ డియర్’’ మత్తుగా!అంతే ఆ స్వరంలోని హస్కీనెస్కు నోటమాట రాలేదు భైరవకు. ‘‘బై.. విల్ మీట్ సూన్..’’ ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ∙∙ ‘‘పిన్నీ..ప్లీజ్.. ఏడిస్తే పోయిన ఆత్మిక మళ్లీ రాదు కదా! చూడూ.. ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయావో?’’ ‘‘ నా వల్ల కావట్లేదు. ఆరోజు దాన్ని ఒంటరిగా వదిలి ఉండాల్సింది కాదు. పాపిష్టిదాన్ని!‘మమ్మీ తలనొప్పిగా ఉంది.. కాసేపు పడుకుంటా’ అంటే.. పడుకోనీ అని నా చేతులతోనే తలుపేసి హాల్లోకి వచ్చా. దాంతోపాటే ఉన్నా అదిలా చేసుండేది కాదు. అది ఉరేసుకొని నా ఊపిరి తీసింది. నేను, మీ బాబాయ్ ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి?’’ రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తోంది చిత్ర. ఆ దుర్ఘటనను అలా ఆమె గుర్తు చేసుకోవడం లక్షా ఎనభయ్యోసారి.‘‘ఊరుకో పిన్నీ.. ప్లీజ్’’ అంతకన్నా ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. ఆత్మిక చనిపోయి ఏడు నెలలు అవుతోంది. ఆకలి, నిద్ర ఆమె దరిదాపుల్లోకి రాక ఏడునెల్లవుతోంది. కాలం చిత్ర గాయాన్ని ఏమాత్రం మాన్పలేకపోతోంది. ఆత్మిక ఆత్మహత్య కంటే కూడా చిత్ర క్షోభే ఆ ఇంట్లో వాళ్లను కలత పెడ్తోంది. కౌన్సెలింగ్,సైకియాట్రి, ఆధ్యాత్మికత.. ఏమీ చేయలేకపోతున్నాయి. ‘‘ఆత్మిక ఆత్మ వచ్చి చెబితే గానీ మీ పిన్నీ మనుషుల్లోపడదు’’ జనాంతికంగా అన్నాడు సురేష్.. భార్య మానసిక స్థితి చూడలేక. ‘‘నేనొస్తేనన్నా.. కాస్త తేరుకొని మనుషుల్లో పడ్తుందని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నా బాబాయ్! ప్చ్..నేనూ ఏం చేయలేక పోతున్నా..’’ బాధగా.‘‘ఛ..ఛ! అలా అనకురా.. నువ్వు రావడం నిజంగా మంచిదే అయింది. నేను కాస్తయినా యాక్టివ్‌గా ఉండగలుగుతున్నా’’ భుజమ్మీద చేయివేస్తూ అనునయంగా అన్నాడు సురేష్. ఆత్మీక, తను కజిన్సే కాని సిబ్లింగ్స్ కన్నా క్లోజ్‌గా ఉండేవాళ్లు. ఒకరంటే ఒకరికే కాదు.. ఆ ఇద్దరన్నదమ్ముల కుటుంబాలకూ ప్రాణం. ‘‘ఆత్మికా.. మై సిస్టర్.. నిన్ను మాకు కాకుండా చేసినవాడిని.. పిన్నిని ఇలా పిచ్చిదానిలా మార్చిన వాడిని వదిలిపెట్టే సమస్యే లేదు..’’ అంటుంటే.. గోడ మీద ఉన్న ఆత్మిక ఫోటోకి వేలాడ దీసిన దండలోంచి ఎర్ర గులాబీ కింద పడింది. ∙∙ ‘‘హలో... మళ్లీ డిస్టర్బ్ చేస్తున్నానా?’’ భైరవ‘‘ఏం లేదు.. చెప్పు’’‘‘నిన్ను కలవకుండానే పోతానేమో’’ భైరవ‘‘అబ్బా..అంత నిరాశా?’’ ‘మరేంచేయను? నీ వాయిస్.. పెక్యూలియర్ వాయిస్ వినే భాగ్యం దొరికింది ఈ జన్మకిది చాలు అనుకుంటా’’ ‘‘ఆహా..’’‘‘నిజం.. ఐ మీన్ ఇట్. గమ్మత్తయిన వాయిస్. నిన్ను చూడకుండా నీతో లవ్‌లో పడ్డానంటే నీ వాయిసే కారణం. యు షుడ్ థ్యాంక్ ఫుల్ టు గాడ్.. అలాంటి గొంతునిచ్చినందుకు’’ భైరవ‘‘సరేగాని..ఎందుకు కాల్ చేశావో చెప్పు’’‘‘ ఈ ఈవెనింగ్ కలవ్వా... ప్లీజ్’’ బతిమాలాడు భైరవ. ‘‘హూ.. ’’నిట్టూరుస్తూ.. ‘‘ఈ ఈవెనింగ్ కుదరకపోవచ్చు. సిక్స్ థర్టీకి రికార్డింగ్ ఉంది. ఆఫ్టర్ టెన్ అయితే ఓకే.. ’’‘‘ నైట్? నీకు ఓకే అయితే నాకూ ఓకే’’ కొంటెగా భైరవ. ‘‘వెన్యూ...?’’‘‘అదీ నువ్వే చెప్పు..’’ అన్నాడు అదే కొంటెతనంతో భైరవ‘‘వాట్సప్ చేస్తా...’’ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ∙∙ రాత్రి.. ‘‘హేయ్.. నీ వాయిస్‌కి తగ్గట్టే నీ టేస్ట్ కూడా పెక్యూలియర్’’ ‘‘ఆహా..’’‘‘కాకపోతే.. ఫస్ట్ టైమ్ నిన్ను చూడబోతుంటే వెన్యూ పెట్టేది ఈ ఊరి శ్మశానంలోనా?’’ వెటకారం భైరవలో.‘‘యే.. భయమేస్తోందా?’’ ‘‘అంతలేదు బేబీ.. త్వరగా రా.. వెయిటింగ్’’ అన్నాడు. ‘‘ వస్తున్నా’’సరిగ్గా పది గంటల పది నిమిషాలకు.. ఫోన్లో సూచించిన ప్రకారం.. ఓ సమాధి దగ్గర నిలబడి ఉన్నాడు సమాధి వెపు మొహం చేసి!సరిగ్గా అతని వెనకాల.. సన్నగా.. భుజాల వరకు జుట్టు.. జీన్స్.. షూ.. క్యాప్ స్వెట్టర్‌తో ఓ ఆకారం. క్యాప్‌తో తలంతా కవర్ చేసుకుని చేతులను జీన్స్ పాకెట్స్‌లో పెట్టుకుని మెడ వంచి ముందున్న ఓ రాయిని బలంగా తన్నింది ఆకారం. రాయి వెళ్లి సరాసరి భైరవ పిరుదుకు తగిలింది. అసంకల్పితంగా దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటూ వెనక్కి తిరిగాడు చటుక్కున.‘‘హాయ్..’’ అంటూ జేబుల్లోంచి చేతులు తీసి తల మీదున్న క్యాప్‌ను వెనక్కి తోస్తూ మొహాన్ని పైకెత్తింది ఆ ఆకారం. షాక్.. భైరవకు. గొంతు సుపరిచితం.. ఫేస్ ఏంటీ.. మీసాలతో?‘‘నువ్వు.. నువ్వు... అబ్బాయివా?’’ విస్మయం.‘‘యెస్.. ఆత్మిక అన్నను. నువ్వు నిలబడ్డది ఆత్మిక సమాధి దగ్గరే’’ చెప్పాడు.‘‘ఎంత మోసం’’ భైరవ. ‘‘నువ్వు నా చెల్లికి చేసిన దాని కంటేనా? ఏరా..ఒకరోజు పరిచయం.. రెండో రోజు ప్రేమ.. మూడో రోజు బ్రేకప్ ఆ... నా చెల్లిని చీట్ చేసింది ఇలాగే కదా?’’ అంటుంటే.. ‘‘అన్నయ్యా.. నువ్వాగు’’ అని వినిపించింది సమాధి వైపు నుంచి. ఇంకో షాక్ భైరవకి. అది ఆత్మిక గొంతు. వినిపించిన వైపు తిరిగాడు భయంగానే. నవ్వుతోంది ఆత్మిక.. నల్లటి చుడీ దార్లో తెల్లగా మెరిసిపోతూ.. పెద్ద జడను మెడకు చుట్టుకుని.. దోసిళ్ల కొద్దీ ఎర్ర గులాబీలను భైరవ మీదకు విసురుతూ. చూస్తుండగానే ఆ గులాబీలన్నీ భైరవను ముంచెత్తాయి శ్వాస తీసుకోనివ్వకుండా.‘‘ఇవన్నీ నువ్వు నాకిచ్చినవే.. తీసుకో.. తీసుకో’’ విరగబడి నవ్వుతూ భైరవ మీదకు వేస్తూనే ఉంది ఆత్మిక.వెనక్కి తిరిగాడు ఆత్మిక అన్న..క్యాప్ తల మీదకు జరుపుకొని చేతులు జేబుల్లోకి దూర్చుకుంటూ! సరస్వతి రమ -
స్మృతికి షాకిచ్చిన సర్వే ఫలితాలు!
న్యూఢిల్లీః ప్రముఖులను, పెద్దలను గౌరవించడం.. ఇరర వ్యక్తులకు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం ముఖ్యంగా భారతదేశంలో పురాతన కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం. ఇటీవల బిహార్ విద్యామంత్రి అశోక్ చౌదరి.. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీని డియర్ అంటూ సంబోధించడం ట్విట్టర్లో వివాదం రేపింది. దీంతో డియర్ వాడొచ్చా లేదా అన్న విషయంపై ఓ జాతీయ మీడియా సంస్థ సర్వే చేసింది. ఎంతమందిని సర్వే చేశామన్న విషయం వాళ్లు చెప్పలేదు గానీ.. ఎక్కువ శాతం మంది 'డియర్' అనొచ్చనే చెప్పారన్నారు. ఇటీవల బిహార్ లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై, ఆ రాష్ట్ర విద్యామంత్రి చౌదరి ట్విట్టర్ లో ''డియర్ స్మృతి ఇరానీ గారూ... మీరు రాజకీయ ప్రసంగాలపై కాకుండా నూతన విద్యావిధానంపై దృష్టిసారిస్తే బాగుంటుంది'' అంటూ రాయడంతో వివాదం తలెత్తింది. చౌదరి కామెంట్ కు స్పందించిన స్మృతి ఇరానీ.. మీరు మహిళలను ఇలా డియర్ అంటూ సంబోధించడం ఎప్పుడు మొదలుపెట్టారంటూ అడిగారు. దీంతో ప్రొఫెషనల్ ఈ మెయిల్స్ పంపేటప్పుడు డియర్ అని రాస్తారు, నేనన్నది తప్పేమీ కాదంటూ చౌదరి సమర్థించుకున్నారు. మహిళలను డియర్ అని పిలవడం సెక్సిస్ట్ రిమార్క్ అవుతుందా అని, కొత్తగా మహిళలకు లేఖ రాయాల్సినపుడు ఎలా సంబోధిస్తే బాగుంటుంది? ఎలా ముగిస్తే బాగుంటుంది? అంటూ మూడు ప్రశ్నలు సర్వేలో భాగంగా జాతీయ మీడియా సంస్థ సంధించింది. అనంతరం మీడియా సంస్థకు వచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి. సెక్సిస్ట్ రిమార్క్ అవుతుందా అన్న ప్రశ్నకు అవును అన్నసమాధానం 18 శాతం మంది నుంచి వస్తే, 82 శాతం మంది కాదు అనడం విశేషం. అలాగే లేఖ రాసేప్పుడు డియర్ అంటూ సంబోధించడాన్ని 35 శాతం మంది సమర్థించగా, 31 శాతం మంది హాయ్ అంటే బాగుంటుందని, 30 శాతం మంది హల్లో అంటే బాగుంటుందని సమాధానం ఇచ్చారు. ముగింపులో రిగార్డ్స్ అనాలని 69 శాతం మంది, యువర్స్ సిన్సియర్లీ లేదా ఫెయిత్ ఫుల్లీ అనాలని 16శాతం మంది, ఆల్ ది బెస్ట్, ఛీర్స్ అంటే బాగుంటుందని 15 శాతం మంది సూచించారు. -
వాహనం ఢీకొని జింక మృతి: కొమ్ములు అపహరణ
తిరుమల: గుర్తు తెలియని ఓ వాహనం ఢీకొని జింక మృతిచెందింది. ఈ సంఘటన తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డు 35వ మలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. మృతిచెందిన జింక కొమ్ములను దుండగులు తీసుకెళ్లినట్టు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.