హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న మరో తెలుగమ్మాయి..! | Telugu Actress Sumaya Reddy Entry Into Tollywood Industry | Sakshi
Sakshi News home page

Sumaya Reddy: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న తెలుగమ్మాయి..!

Published Sun, Dec 17 2023 4:11 PM | Last Updated on Sun, Dec 17 2023 4:30 PM

Telugu Actress Sumaya Reddy Entry Into Tollywood Industry - Sakshi

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు ఎంతమంది ఉ‍న్నారంటే వేళ్లమీదే లెక్క పెట్టేస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీలో తెలుగు చాలా అరుదుగా హీరోయిన్లుగా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగమ్మాయిలు సైతం సినీ పరిశ్రమలో దూసుకెళ్తున్నారు. తాజాగా మరో తెలుగమ్మాయి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. 

అనంతపురానికి చెందిన తెలుగు అమ్మాయి సుమయారెడ్డి మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. సినిమాల్లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. సుమయ తన తొలి చిత్రం డియర్ ఉమ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. పృథ్వీ అంబర్‌తో కలిసి నటించిన ఈ చిత్రానికి  రచయితగా, నిర్మాతగా కూడా వ్యవరిస్తున్నారు.

ఈ మూవీ కోసం విభిన్నమైన క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తూ మల్టీ టాలెంట్‌ను పరిచయం చేస్తున్నారు. సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సాయి రాజేష్ మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా.. త్వరలోనే చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement