స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, నటి ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'డియర్'. నట్ మెగ్ ప్రొడక్షన్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఆయిరమ్' ఫేమ్ ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. కాళీ వెంకట్, ఇళవరసు, రోహిణి, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్)
ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా 'డియర్' షూటింగ్ తాజాగా పూర్తి చేసుకుంది. 35 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసినట్లు నిర్మాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'డియర్' స్టోరీ, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉన్నాయని అన్నారు.
జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ కలిసి తొలిసారిగా నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం, చిత్ర విడుదల తేదీని వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
(ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక)
Comments
Please login to add a commentAdd a comment