సర్వం తాళమయం | GV Prakash's 'Sarvam Thaala Mayam' first look and teaser unveiled | Sakshi
Sakshi News home page

సర్వం తాళమయం

Published Sun, Nov 25 2018 2:52 AM | Last Updated on Sat, Mar 23 2019 9:28 PM

GV Prakash's 'Sarvam Thaala Mayam' first look and teaser unveiled - Sakshi

జీవీ ప్రకాశ్‌ కుమార్‌

సంగీత ప్రధానంగా సాగే సినిమా అంటే కళా తపస్వి కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘శంకరా భరణం, శృతిలయలు, సాగర సంగమం’ వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. అలాంటి సినిమాలు చూసినపుడు.. సినిమా ఎలా ఉంది అంటే ‘సర్వం తాళమయం’ అంటారు. ఇప్పుడు అదే టైటిల్‌తో సంగీత సరస్వతితో ఎంతో అనుబంధం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ మేనల్లుడు అనే ట్యాగ్‌ నుంచి త్వరగానే బయటపడి సంగీతదర్శకుడిగా మంచి పేరు తెచ్చుకుని, ఇప్పుడు హీరోగానూ దూసుకెళుతున్నారు జీవీ.

‘సర్వం తాళమయం’లో ఆయనకు జోడీగా అపర్ణ బాలమురళీ నటిస్తున్నారు. రాజీవ్‌ మీనన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మైండ్‌ స్క్రీన్స్‌ పతాకంపై ఆయన భార్య లత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో జీవీ ప్రకాశ్‌ చేతిలో మృదంగంతో సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా ఉన్నారు. రవి యాదవ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాకేందు మౌళి సాహిత్యాన్ని అందిస్తున్నారు. డిసెంబర్‌ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement