
నందితా శ్వేత
ఎన్ ఫర్ ‘నర్మద’. ప్రస్తుతం ఇలాగే చెబుతున్నారు కథానాయిక నందితా శ్వేత. ఎందుకంటే ఆమె నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ఇది. ఇందులో ఏడేళ్ల బాబుకి తల్లి పాత్రలో నటించడానికి నందిత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. కథ బాగా నచ్చడంతో తల్లి పాత్ర చేయడానికి ఒప్పుకున్నారట. గీతా రాజ్‌పుత్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమా మంగళవారం ప్రారంభమైంది.
‘‘మదర్ అండ్ చైల్డ్ రిలేషన్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుంది. నందితకు ఇది డిఫరెంట్ క్యారెక్టర్’’ అన్నారు దర్శకుడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో మంచి అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన నందిత ఇప్పుడు నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీనివాస కల్యాణం’లో ఓ నాయికగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా మరో నాయిక. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులోపు రిలీజ్ చేయాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment