బ్యాడ్‌ గర్ల్‌ | amala paul new movie with Nizar Shafi | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌ గర్ల్‌

Published Mon, Apr 2 2018 3:28 AM | Last Updated on Mon, Apr 2 2018 3:28 AM

amala paul new movie with Nizar Shafi - Sakshi

అమలా పాల్‌

ట్రెడిషనల్‌ రోల్స్‌తో ఎంట్రీ ఇచ్చి, మెల్లిగా గ్లామరస్‌ రోల్స్‌ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న అమలా పాల్‌ ఇప్పుడు కెరీర్‌ని యూ టర్న్‌ తిప్పారు. కొత్త క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. తమిళంలో చేస్తున్న ‘అదో అంద పరవై పోల’లో ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ రోల్‌ చేస్తున్న ఆమె ఇప్పుడు ఏకంగా బ్యాడ్‌ గర్ల్‌గా మారారట.

‘భలేభలే మగాడివోయ్, మహానుభావుడు’ సినిమాలకు కెమెరామేన్‌గా పని చేసిన నిజర్‌ షఫీ దర్శకుడిగా మారి తెలుగు–తమిళ్‌ బైలింగువల్‌ మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నందితా శ్వేత, శ్రద్ధ శ్రీనాథ్, అదితీ ఆర్య, అనీషా ఆంబ్రోస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోనే అమలా పాల్‌ విలన్‌గా నటించనున్నారు. ఆమె పాత్ర  1950ల కాలంలో ఉంటుందట. ఇన్వెస్టిగేటీవ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు నిజర్‌ షఫీ కెమెరామేన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ఇయర్‌ సెకండ్‌ హాఫ్‌లో రిలీజ్‌ కానుందని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement