ఆ హిట్లు కపటధారికి నమ్మకాన్నిచ్చాయి – నాగార్జున | Uppena, Krack Movies Hits Has Given Confidence To Telugu Cinema Says Nagarjuna On Kapatadhaari Movie Prerelease Event | Sakshi
Sakshi News home page

ఆ హిట్లు కపటధారికి నమ్మకాన్నిచ్చాయి – నాగార్జున

Feb 17 2021 11:36 PM | Updated on Feb 17 2021 11:58 PM

Uppena, Krack Movies Hits Has Given Confidence To Telugu Cinema Says Nagarjuna On Kapatadhaari Movie Prerelease Event - Sakshi

ధనంజయన్, నాగార్జున, సుమంత్, నందితా శ్వేత, ప్రదీప్‌ కృష్ణమూర్తి 

‘‘కపటధారి ట్రైలర్‌ ఆసక్తిగా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. సుమంత్, నందితా శ్వేత జంటగా ప్రదీప్‌ కష్ణమూర్తి దర్శకత్వంలో డా. ధనంజయన్‌ నిర్మించిన చిత్రం ‘కపటధారి’. ఈ శుక్రవారం విడుద లవుతున్న ఈ చిత్రం కన్నడ ‘కవలుధారి’కి రీమేక్‌. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘కోవిడ్‌ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? రారా? అనుకున్నాం. ‘క్రాక్‌’ సినిమా ఆ భయాలను పోగొట్టింది. ‘ఉప్పెన’తో హిట్‌ అందుకున్న హీరో వైష్ణవ్‌ తేజ్‌కి కంగ్రాట్స్‌. ఈ విజయాలు ‘కపటధారి’ యూనిట్‌కు నమ్మకాన్నిచ్చాయి’’ అన్నారు. సుమంత్‌ మాట్లాడుతూ – ‘‘వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. అందుకు మా చిన్న మావయ్యే (నాగార్జున) స్ఫూర్తి. ‘కపటధారి’ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘ప్రస్తుతం తెలుగు సినిమా ఇండియన్‌ సినిమాను లీడ్‌ చేస్తుందనే నమ్మకం పెరిగింది’’ అన్నారు ధనంజయన్‌. ‘‘తెలుగు, తమిళంలో నేనే దర్శకత్వం వహించాను’’ అన్నారు ప్రదీప్‌ కృష్ణమూర్తి. ఇంద్రగంటి మోహనకృష్ణ, అడివి శేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement