Kapatadhaari
-
కపటధారి మూవీ టీం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
-
కపటధారి మూవీ రివ్యూ
టైటిల్ : కపటధారి జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : సుమంత్, నందిత, నాజర్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ : క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు : ధనంజయన్, లలితా ధనంజయన్ దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి సంగీతం : సిమన్ కె కింగ్ సినిమాటోగ్రఫీ : రసమతి ఎడిటర్ : ప్రవీన్ కేఎల్ విడుదల తేది : ఫిబ్రవరి 19 అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి సుమంత్ కృషి చేస్తున్నాడు. హీరోయిజం, మాస్ మసాల అంశాలను పక్కనబెట్టి విభిన్న కథలు ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వరుస ప్రేమకథా చిత్రాలు చేసి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న సుమంత్.. ఇప్పుడు థ్రిల్లర్ కథలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈసారి ‘కపటధారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్. కన్నడ సూపర్ హిట్ ‘కవలుధారి’ సినిమాకు ఇది రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తమిళ వెర్షన్ జనవరి 28న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మరి కన్నడ, తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సుమంత్‌కు ఈ సినిమా హిట్ అందించిందా? రివ్యూలో చూద్దాం. కథ గౌతమ్ (సుమంత్) ఒక సిన్సియర్ ట్రాఫిక్ ఎస్సై. కానీ ఆ జాబ్‌తో అతను సంతృప్తి చెందడు. పోలీసుగా విధుల్లో చేరి క్రైమ్ కేసులను విచారించాలని అనుకుంటాడు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా..పై అధికారులు అతనికి ప్రమోషన్ ఇవ్వరు. ఇదిలా ఉంటే.. ఒకరోజు మెట్రో కోసం తవ్విన తవ్వకాలల్లో ఓ ముగ్గురి అస్థిపంజరాలు బయటపడతాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పైపైన విచారణ చేసి కేసును మూసేసే ప్రయత్నం చేస్తారు. కానీ గౌతమ్ మాత్రం ఆకేసును సీరియస్‌గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి జర్నలిస్ట్ గోపాల్ కృష్ణ (జయప్రకాశ్), 40 ఏళ్ల క్రితం ఆ కేసును డీల్ చేసిన రిటైర్డ్ పోలీసు అధికారి రంజన్ (నాజర్) పరిచయం అవుతారు. కేసు విచారణలో ఆలేరు శ్రీనివాస్ అనే మరోవ్యక్తి పేరు బయటకు వస్తుంది. అసలు ఈ ఆలేరు శ్రీనివాస్ ఎవరు? అతనికి ఈ కేసుకు ఏం సంబంధం? మెట్రో తవ్వకాల్లో లభించిన అస్థిపంజరాలు ఎవరివి? వాళ్లు ఎలా చనిపోయారు? కేసు విచారణలో గౌతమ్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? చివరకి అతను ఈ కేసును ఎలా ఛేదించాడనేది మిగతా కథ. నటీనటులు ట్రాఫిక్ ఎస్సై గౌతమ్ పాత్రలో సుమంత్ ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్లను కూడా బాగా పండించాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం నాజర్ పాత్ర. రిటైర్డ్ పోలీసు అధికారి రంజిత్ పాత్రకు ఆయన ప్రాణం పోశాడు. దాదాపు హీరోతో సమానంగా స్ర్కీన్‌ను పంచుకున్నాడు. తన అనుభవం అంతా తెరపై కనబడుతుంది. ఇక జరల్నిస్టుగా జయప్రకాశ్ తన పాత్రకు న్యాయం చేశాడు. కమెడియన్ వెన్నెల కిషోర్ రెండు మూడు సీన్లలో కనిపించినా.. తనదైన కామెడీ పంచ్‌లతో నవ్విస్తాడు. హీరోయిన్ నందిత, గెస్ట్‌రోల్‌లో కనిపించిన సుమన్ రంగనాథన్, విలన్‌గా చేసిన సతీష్ కుమార్ తమ పరిధిమేరకు నటించారు. విశ్లేషణ ‘కవలుధారి’కి రీమేక్‌గా వచ్చింది ‘కపటధారి’. క్రైమ్ థ్రిల్లర్ సినిమా కావడంతో విడుదలైన రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను బాగానే ఆదరిస్తారు. అదే నమ్మకంతో ప్రదీప్ కృష్ణమూర్తి తెలుగులో ఈ మూవీని తెరకెక్కించాడు. అతని నమ్మకం కొంతవరకు వమ్ముకాలేదనే చెప్పాలి. థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు మెండుగా ఉండటం సినిమాకి చాలా ప్లస్ అయింది. అయితే, ఈ కథను తెలుగు ప్రేక్షకులను నచ్చే విధంగా తీర్చిదిద్దడంలలో దర్శకుడు కొద్దిమేరకే సఫలం అయ్యాడని చెప్పొచ్చు. దర్శకుడు థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఫీల్‌ని క్రియేట్ చేయగలిగాడు కానీ ఎమోషనల్ అంశాలను మరిచాడు. ఒరిజినల్ వెర్షన్‌ని మక్కీకి మక్కీ దించేశాడు. అది కొంత మైనస్. కథ నెమ్మదిగా సాగడం, కొన్ని సీన్లు రిపీట్ కావడం ప్రేక్షకుడిని ఇబ్బంది పెడతాయి. ఇలాంటి క్రైమ్ తరహా సినిమాలు ఇదివరకే చూశాం కదా అనే ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిమోన్ కె కింగ్ నేపథ్య సంగీతం. తన బీజీయంతో కొన్ని సన్నివేశాలకు అతను ప్రాణం పోశాడు. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది అనడం అతిశయోక్తికాదు. ఎడిటర్ ప్రవీణ్ కెఎల్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సుమంత్, నాజర్ నటన ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌లోని కొన్ని థ్రిల్లింగ్ అంశాలు నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్ స్ర్కీన్ ప్లే రొటీన్ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ కథ పూరి నాకే చెప్పారు
‘‘ఇప్పటివరకూ ప్రేక్షకులు చాలా రకాల థ్రిల్లర్ చిత్రాలు చూశారు. కానీ మా ‘కపటధారి’ ఓ కొత్త తరహా థ్రిల్లర్. ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది అని చెప్పగలను’’ అన్నారు సుమంత్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కపటధారి’. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఈ సినిమాను జి. ధనంజయ్ నిర్మించారు. కన్నడ చిత్రం ‘కవలుదారి’కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా సుమంత్ చెప్పిన విశేషాలు. ►‘మళ్ళీ రావా’ చిత్రం తర్వాత వరుసగా నాకు రొమాంటిక్ చిత్రాలు వస్తాయనుకున్నాను. కానీ ఎక్కువ థ్రిల్లర్ ఆఫర్స్ వచ్చాయి. ‘కపటధారి’ చిత్రం థ్రిల్లర్స్‌లోనే భిన్నంగా ఉంటుంది. ‘కవలుదారి’ చూసినప్పడు నాకు కొన్ని సన్నివేశాలు కొత్తగా అనిపించాయి. ఈ సినిమా మూడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. కథ ఏ ప్రాంతం ఆడియన్స్‌కి అయినా కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ సినిమా చేశాను. ►ఈ సినిమాలో ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపిస్తాను. 40 ఏళ్ల క్రితం మూసివేసిన ఓ కేసును ఓ ట్రాఫిక్ పోలీస్ ఎలా చేధించాడు అనే కథాంశంతో సినిమా ఉంటుంది. కామెడీ, యాక్షన్ అన్నీ మోతాదులోనే ఉంటాయి. ఈ కథ నిజంగా జరిగినట్టుగా అనిపించేలా ఉంటుంది. కన్నడ సినిమా కాస్త నెమ్మదిగా ఉంటుంది. తెలుగు వెర్షన్ కాస్త వేగంగా ఉంటుంది. ►మహాభారతంలో శ్రీకృష్ణుణ్ణి కపటధారి అంటారు. అంటే పైకి కనిపించేది ఒకటి. కానీ లోపల జరిగేది ఒకటి. ఈ కథకు ఈ టైటిల్ కరెక్ట్‌గా సూట్ అవుతుంది. గత ఏడాది ఫిబ్రవరికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మార్చిలో విడుదల కావాల్సింది. లాక్‌డౌ¯Œ వచ్చింది. ►నేనెప్పుడూ నాకు నచ్చిన, నాకు నప్పే కథలే ఎంచుకోవడానికి ఇష్టపడతాను. ఒకవేళ ఆ కథ నాకు సూట్ అవ్వదనిపిస్తే ఆ దర్శకుడికి అప్పుడే చెప్పేస్తాను. గతంలో చాలాసార్లు ఇలా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్‌గారు ‘దేశముదురు’ కథ నాకు చెప్పారు. ఇది నాకు సూట్ కాదు సార్ అన్నాను. ఆ సినిమా నాతో తీస్తే పక్కా ఆడేది కాదు. ►మంచి కథ కుదిరితే ఓటీటీలో చేస్తాను. నిర్మాతగా మారాలనే ఆలోచన లేదు. ఒకవేళ ఎవరైనా మంచి కథతో వచ్చి, నిర్మాత దొరకలేదు అంటే నిర్మిస్తాను. ప్రస్తుతానికి అయితే నా సినిమాలకు నిర్మాతలు వస్తున్నారు. ఆ విషయంలో హ్యాపీ. నెక్ట్స్ ‘అనగనగా ఓ రౌడీ’ అనే సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత ఓ రొమాంటిక్ డ్రామా చేస్తాను. ►లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే జిమ్ పెట్టుకున్నాను. హోమ్ థియేటర్ కాస్త అప్‌గ్రేడ్ చేసుకున్నాను. లాక్‌డౌ¯Œ నాకు పెద్ద తేడా అనిపించలేదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండటం నాకు అలవాటు. -
ఆరు చలాన్లు కట్టిన టాలీవుడ్ హీరో
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' వంటి విలక్షణమైన హిట్ చిత్రాల్లో నటించి, హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అనేదానికన్నా ఎంత గుర్తింపు సంపాదించుకుందనేదాన్నే ఎక్కువగా పట్టించుకుంటాడాయన. తాజాగా అతడు సుమంత్, నందిత శ్వేతల కపటధారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ట్రాఫిక్ ఎస్సై వేషం కట్టిన శ్యామల ఇప్పటివరకు ఎన్ని చలాన్లు కట్టావంటూ కూపీ లాగింది. దీంతో అడ్డంగా దొరికిపోయిన అడివి శేష్ అసలు విషయాన్ని చెప్పక తప్పలేదు. డ్రింక్ అలవాటు లేదు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎప్పుడూ పట్టుబడలేదని, అయినా ఆరు చలానాలు పడ్డాయని తెలిపాడు. ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ దగ్గర ఆపి తన ఆరు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పి కట్టించుకునేవరకు వదల్లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమా మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మిస్తోంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, సయీ మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. చదవండి: ఆయన కళ్లల్లో ప్యాషన్ కనిపించింది– అడివి శేష్ కంగనాపై రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ -
ఆ హిట్లు కపటధారికి నమ్మకాన్నిచ్చాయి – నాగార్జున
‘‘కపటధారి ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. సుమంత్, నందితా శ్వేత జంటగా ప్రదీప్ కష్ణమూర్తి దర్శకత్వంలో డా. ధనంజయన్ నిర్మించిన చిత్రం ‘కపటధారి’. ఈ శుక్రవారం విడుద లవుతున్న ఈ చిత్రం కన్నడ ‘కవలుధారి’కి రీమేక్. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? రారా? అనుకున్నాం. ‘క్రాక్’ సినిమా ఆ భయాలను పోగొట్టింది. ‘ఉప్పెన’తో హిట్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్‌కి కంగ్రాట్స్. ఈ విజయాలు ‘కపటధారి’ యూనిట్‌కు నమ్మకాన్నిచ్చాయి’’ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ – ‘‘వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. అందుకు మా చిన్న మావయ్యే (నాగార్జున) స్ఫూర్తి. ‘కపటధారి’ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘ప్రస్తుతం తెలుగు సినిమా ఇండియన్ సినిమాను లీడ్ చేస్తుందనే నమ్మకం పెరిగింది’’ అన్నారు ధనంజయన్. ‘‘తెలుగు, తమిళంలో నేనే దర్శకత్వం వహించాను’’ అన్నారు ప్రదీప్ కృష్ణమూర్తి. ఇంద్రగంటి మోహనకృష్ణ, అడివి శేష్ తదితరులు పాల్గొన్నారు. -
'కపటధారి' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ఇవన్నీ సిద్ధం.. మీరు సిద్ధమా?
థియేటర్స్‌లో సినిమాలు లేక 2020 వెలవెలబోయింది. 2021 కొత్త చిత్రాల రిలీజులతో జోరుగా హుషారుగా ఉండబోతోంది. గత ఏడాది మిస్సయిన మజాని రెండింతలు ఈ ఏడాది ఇవ్వబోతోంది. స్టార్స్ అందరూ తమ చిత్రాలను థియేటర్స్‌కు తీసుకొచ్చే డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాల విడుదల తేదీలు వచ్చాయి. తాజాగా మరిన్ని అప్ డేట్స్ వచ్చాయి. వేసవి నుంచి దసరా వరకూ ఒక్కో డేట్‌ను ఒక్కో సినిమా తీసుకుంది. ఆ విశేషాలు. ట్రిపుల్ ఫన్ ‘ఎఫ్2’తో డబుల్ ఫన్ ఇచ్చాం. ఇప్పుడు ట్రిపుల్ ఫన్ ఇవ్వడానికి రెడీ అయ్యాం అంటోంది ‘ఎఫ్ 3’ చిత్రబృందం. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్ 3’. ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రానికి ఇది సీక్వెల్. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ సీక్వెల్లో కో బ్రదర్స్ వెంకీ, వరుణ్ డబ్బు సంపాదించడం మీద ఎక్కవ దృష్టి పెడతారట. ఈ సినిమాను ఆగస్ట్ 27న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. పుష్పరాజ్ వేట త్వరలో.. అల్లు అర్జున్, సుకుమార్‌ది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ గతంలో ‘ఆర్య, ఆర్య 2’ సినిమాలు చేశారు. తాజాగా ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయిక. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేస్తున్నారు. ‘పుష్పరాజ్ వేట త్వరలోనే ఆరంభం’ అంటూ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. కూత మొదలు ‘సీటీమార్’ కోసం కబడ్డీ కోచ్‌గా మారారు గోపీచంద్. ఏప్రిల్ 2నుంచి థియేటర్స్‌లో కూత మొదలవుతుందట. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘గోపీచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయింది’’ అని చిత్రబృందం పేర్కొంది. కపటధారి రెడీ? క్రైమ్‌ని పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీస్ సుమంత్ సిద్ధమయ్యారు. సుమంత్, నందితా శ్వేత జంటగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కపటధారి’. ఇందులో సుమంత్ ట్రాఫిక్ పోలీస్‌గా కనిపించనున్నారు. నాజర్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటించారు. కన్నడ చిత్రం ‘కవులుదారి’కి ఇది తెలుగు రీమేక్. ఫిబ్రవరి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. గని రెడీ బాక్సర్ గని తన పంచ్ ఎలా ఉంటుందో చూపించడానికి రెడీ అవుతున్నారు. జూలైలో తన పంచ్ పవర్ చూపించనున్నారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ నటిస్తున్న చిత్రం ‘గని’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ కథానాయిక. ఉపేంద్ర, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రాధాకృష్ణ ‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా టి.డి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ పార్వతి ఓ కీలక పాత్రలో నటించారు. పుష్పాల సాగరిక నిర్మించారు. నిర్మల్ బొమ్మలు తయారు చేసే కళాకారుల సమస్యల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కామ్రేడ్ రవన్న వస్తున్నాడు ప్రజల సమస్యలపై పోరాడటానికి కామ్రేడ్ రవన్న అయ్యారు రానా దగ్గుబాటి. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా చేస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయిక. ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీరావ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. నివేదా పేతురాజ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో కనిపిస్తారు రానా. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. -
మెట్రో లైన్ తవ్వకాల్లో అస్థి పంజరాలు!
సుమంత్ కథానాయకుడిగా ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కపటధారి. ఈ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత అక్కినేని- నాగచైతన్య నేడు సాయంత్రం విడుదల చేశారు. ఇందులో మెట్రోలైన్ తవ్వకాల్లో అస్థిపంజరాలు బయటపడతాయి. అది ఎవరిది? వారిని ఎవరు? ఎందుకు చంపారు? దీని వెనక ఉన్నదెవరు? అన్న అంశాలను ఆధారాలతో సహా బయటపెట్టి దోషులను శికక్షించాలన్న కసితో ఆ కేసును పూర్తిగా స్టడీ చేస్తుంటాడు ట్రాఫిక్ పోలీసాఫీసర్ అలియాస్ హీరో సుమంత్. ఒక సిన్సియర్ పోలీసాఫీసర్‌కు ఓపెన్ చేసిన కేసును క్లోజ్ చేశాకే ప్రశాంతంగా ఉంటుందంటున్నాడు నాజర్. నిజంగా ఆయన చెప్పినట్లుగానే సుశాంత్ కూడా నిరంతరం ఆ కేసును చేధించేందుకు తీవ్రంగా పాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: జీతాలివ్వకుండా వేధిస్తున్న ఆర్జీవీ!) ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను దాటుకుంటూ, నిజానిజాలు నిర్ధారణ చేసుకుంటూ కేసు పరిష్కారం దిశగా ఒక్కో అడుగు వేస్తున్నాడు. అయితే ఇదంతా ఎవరు చేశారో తెలిస్తే షాకైపోతావని చెప్తున్నాడో వ్యక్తి. మరి ఆ హంతుకుడి గురించి ఆయన నిజంగానే నోరు విప్పాడా? లేదా సుమంతే అతడిని కనుక్కున్నాడా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా రిలీజయ్యేవరకు వేచి చూడాల్సిందే. సస్పెన్స్ అంశాలు బాగానే దట్టించిన ఈ థ్రిల్లర్ ట్రైలర్ సోషల్ మీడియాలో జనాలను ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో నందిని శ్వేత హీరోయిన్గా నటించగా ప్రదీప్ క్రిష్ణమూర్తి దర్శకత్వం వహించారు. క్రియేటివ్ నెంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై డా.జీ.ధనంజయన్, లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్‌ను ఓసారి చూసేయండి.. (చదవండి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది అదే : శ్రుతీహాసన్)