Sumanth "Kapatadhaari" Movie Official Trailer Launched By Samantha, Naga Chaitanya - Sakshi
Sakshi News home page

ట్రైలర్‌: 'కపటధారి'ని సుమంత్‌ కనుక్కుంటాడా?

Published Tue, Jan 12 2021 6:35 PM | Last Updated on Tue, Jan 12 2021 8:57 PM

Kapatadhaari Trailer Released By Samantha, Naga Chaitanya - Sakshi

సుమంత్‌ కథానాయకుడిగా ప్రదీప్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కపటధారి. ఈ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సమంత అక్కినేని- నాగచైతన్య నేడు సాయంత్రం విడుదల చేశారు. ఇందులో మెట్రోలైన్‌ తవ్వకాల్లో అస్థిపంజరాలు బయటపడతాయి. అది ఎవరిది? వారిని ఎవరు? ఎందుకు చంపారు? దీని వెనక ఉన్నదెవరు? అన్న అంశాలను ఆధారాలతో సహా బయటపెట్టి దోషులను శికక్షించాలన్న కసితో ఆ కేసును పూర్తిగా స్టడీ చేస్తుంటాడు ట్రాఫిక్‌ పోలీసాఫీసర్‌ అలియాస్‌ హీరో సుమంత్‌. ఒక సిన్సియర్‌ పోలీసాఫీసర్‌కు ఓపెన్‌ చేసిన కేసును క్లోజ్‌ చేశాకే ప్రశాంతంగా ఉంటుందంటున్నాడు నాజర్‌. నిజంగా ఆయన చెప్పినట్లుగానే సుశాంత్‌ కూడా నిరంతరం ఆ కేసును చేధించేందుకు తీవ్రంగా పాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: జీతాలివ్వకుండా వేధిస్తున్న ఆర్జీవీ!)

ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను దాటుకుంటూ, నిజానిజాలు నిర్ధారణ చేసుకుంటూ కేసు పరిష్కారం దిశగా ఒక్కో అడుగు వేస్తున్నాడు. అయితే ఇదంతా ఎవరు చేశారో తెలిస్తే షాకైపోతావని చెప్తున్నాడో వ్యక్తి. మరి ఆ హంతుకుడి గురించి ఆయన‌ నిజంగానే నోరు విప్పాడా? లేదా సుమంతే‌ అతడిని కనుక్కున్నాడా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా రిలీజయ్యేవరకు వేచి చూడాల్సిందే. సస్పెన్స్‌ అంశాలు బాగానే దట్టించిన ఈ థ్రిల్లర్‌ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో జనాలను ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో నందిని శ్వేత హీరోయిన్‌గా నటించగా ప్రదీప్‌ క్రిష్ణమూర్తి దర్శకత్వం వహించారు. క్రియేటివ్‌ నెంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై డా.జీ.ధనంజయన్‌, లలిత ధనంజయన్‌ నిర్మిస్తున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్‌ను ఓసారి చూసేయండి.. (చదవండి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది అదే : శ్రుతీహాసన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement