Jetty Review - Can Jetty Movie Entertainment for Audience this Weekend?
Sakshi News home page

Jetty Movie Review In Telugu: ‘జెట్టి’ మూవీ రివ్యూ

Published Sat, Nov 5 2022 12:02 AM | Last Updated on Tue, Nov 8 2022 9:29 PM

Jetty Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: జెట్టి 
నటీనటులు: మాన్యం కృష్ణ, నందిత శ్వేతా, తేజశ్వని బెహెర, ఎంఎస్‌ చౌదరి, జి.కిశోర్‌, గోపి, జీవ, శివాజీ రాజా, సుమన్‌ శెట్టి తదితరులు
నిర్మాణ సంస్థ: వర్థని ప్రొడక్షన్స్
నిర్మాతలు: కే వేణు మాధవ్
దర్శకత్వం: సుబ్రహ్మణ్యం పిచ్చుక
సంగీతం: కార్తీక్ కొడకండ్ల
విడుదల తేది: నవంబర్‌ 04, 2022

కథేంటంటే...
కటారిపాలెం గ్రామ ప్రజలకు కట్టుబాట్లు ఎక్కువ. ఆ కట్టుబాట్లను ఊరి పెద్ద జాలయ్య(ఎంఎస్‌ చౌదరి)పరిరక్షిస్తూ.. ఆ ఊరికి, అక్కడ ఉన్నా చుట్టూ పక్కల ప్రాంతానికి పెద్ద కాపుగా ఉంటారు.తరచూ గ్రామానికి చెందిన మత్స్య కారుల బోట్స్ తుపానుల తాకిడికి కొట్టుకు పోయి నష్టాలను తెస్తుంటాయి. దాంతో ఎలాగైనా జెట్టి నిర్మించి మత్స్య కారులను ఆదుకోవాలని ఆ ప్రాంత ఎమ్మెల్యే అయిన దశరథ రామయ్య(శివాజీ రాజా)కి మొరపెట్టుకుంటారు.

అయితే అతను ప్రతి పక్ష పార్టీ కి చెందిన ఎమ్మెల్యే కావడంతో తానూ జెట్టిని కట్టలేనని చేతులెత్తేస్తాడు. అయితే ఈ జెట్టి నిర్మిస్తే మత్స్యకారులు తమను లెక్క చేయరని విలన్ (మైమ్ గోపి ) అడ్డు తగులుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ గ్రామానికి ఉపాధ్యాయినిగా వచ్చిన శ్రీ (కృష్ణ మాన్యం) గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ... జాలయ్య కూతురు మీనాక్షి( నందిత శ్వేత) ప్రేమలో పడతారు. వీరిరువురు ఓ రోజు గ్రామ వదిలి వెళ్ళిపోతారు. దాంతో ఆ ఊరి సంస్కృతి సంప్రదాయం, కట్టు బాట్ల ప్రకారం జాలయ్య అవమానంగా ఫీల్ అవుతాడు. మరి జాలయ్య ఓ వైపు తనని నమ్ముకున్న మత్స్య కారులకి జెట్టిని ప్రభుత్వం నుంచి సాధించుకున్నారా? అలాగే ఊరి కట్టుబాట్లని లెక్క చేయకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిన తనకూతురుని ఎం చేసాడు అనేదే జెట్టి మిగతా కథ.

ఎలా ఉందంటే..
వందల గ్రామాలు, కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు, వాళ్ళ జీవితాల కోసం చేసే పోరాటమే జెట్టి సినిమా. ప్రపంచానికి మారుమూల బ్రతికే మత్స్యకారుల కఠినమైన‌ కట్టుబాట్లు, వారి జీవనశైలి, మ‌త్స్య‌కారులు పోరాటం చేసి జెట్టిని ఎలా సాధించారు అన్న‌దే ఈ సినిమా క‌థాంశం. సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి అంటారు. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో ఈ సినిమా కథను తెరకెక్కించారు దర్శకుడు. ఇందులో దర్శకుడు తీరా ప్రాంతంలో ఉన్న కటారి పాలెం అనే ఓ గ్రామాన్ని తీసుకొని... ఆ ప్రాంతం, దాని చుట్టూ పక్కల ఉండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా కథ నాన్ని రాసుకుని వెండితెరపై మత్స్య కారుల జీవితాన్ని ఆవిష్కరించారు. 

(చదవండి: ‘ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ)

అలానే మత్స్య కారులని దోచుకునే ఓ మోతుబరి ఆ ప్రాంతాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంటాడు. అతడిపై మత్య్సకారులు ఎందుకు ఎదురు తిరిగారు అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని రాసుకున్న కథ, కథనాలు ప్రేక్షకులని కట్టి పడేస్తాయి. ఇందులో ఎంతో  భావోద్వేగం ఉంటుంది. కూతుళ్ల మధ్య ఉండే  ఓ ఎమోషనల్ బాండింగ్‌ క్లైమాక్స్‌ లో కంటతడి పెట్టిస్తుంది. ఆ  ప్రాంతానికి జెట్టి తీసుకు రావడానికి ఓ తండ్రి ఏం చేశారు అనేది ఈ సినిమాకు ఆత్మ లాంటిది. జెట్టి సినిమా గుండెను బరువెక్కించే సినిమా. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

గ్రామ పెద్ద జాలయ్య పాత్రలో ఎమ్మెస్ చౌదరి బాగా క్యారీ చేశారు. తన్ని నమ్ముకున్న వారికి ఓ గ్రామ పెద్దగా ఎలా సహాయం చేయాలనే పాత్రని బాగా పండించారు. హీరోగా నటించిన కృష్ణ మాన్యం... స్కూల్ టీచర్ పాత్రలోను ... గ్రామాభివృద్ధికి పాటు పడే మంచి యువ ఉపాధ్యాయ పాత్రలో చక్కగా ఒదిగి పోయారు. హీరో కటౌట్ కూడా ఆరడుగులు పైనే ఉండటంతో యాక్షన్ సీన్స్ లోను మెప్పిచారు. అతనికి జోడిగా నటించిన నందిత శ్వేత పైగా గ్రామీణ యువతిగా, ఫిషరీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే అధికారిణిగా చక్కగా నటించారు. విలన్ గా మైమ్ గోపి రౌద్రం పండించారు. పొలిటీషియన్ పాత్రలో శివాజీ రాజా పర్వాలేదు అనిపించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం బాగుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన పాట బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా  ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement