క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఆకట్టుకుంటోన్న ‘7’ ట్రైలర్‌ | 7 Movie Trailer Released | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఆకట్టుకుంటోన్న ‘7’ ట్రైలర్‌

Published Thu, May 9 2019 4:58 PM | Last Updated on Thu, May 9 2019 5:58 PM

7 Movie Trailer Released - Sakshi

క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ఎక్కువగా తమిళ, మలయాళంలో వస్తుండగా.. ప్రస్తుతం తెలుగులో కూడా వీటి హవా కొనసాగుతోంది. తాజాగా ‘7’ ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ  ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. 

అమ్మాయిలు వరుసగా హత్యకు గురవటం, వాటికి కారణాలు ఏంటో తెలియకపోవడం, కార్తీక్‌ అనే కుర్రాడే ఈ హత్యలు చేశాడని పోలీసులు అనుమానించడం.. ఇలా ఈ కేసును చేదించడం.. ఈ క్రమంలో ఒకేలా ఇద్దరు ఉన్నారా? ఇలా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. ఈ చిత్రంలో నందితా శ్వేతా, రెజీనా, రెహమాన్‌ కీలకపాత్రల్లో నటిస్తుండగా.. చేతన్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. జూన్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement