మే నెలలో ప్రేక్షకుల ముందుకు ‘అక్షర’ | Nanditha Swetha Akshara Movie Release Date | Sakshi
Sakshi News home page

మే నెలలో ప్రేక్షకుల ముందుకు ‘అక్షర’

Published Wed, Feb 20 2019 3:36 PM | Last Updated on Wed, Feb 20 2019 3:38 PM

Nanditha Swetha Akshara Movie Release Date - Sakshi

ఎక్కడికీపోతావు చిన్నవాడా సినిమాతో ఆకట్టుకున్న నందితా శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెండ్ సినిమా అక్షర.  విద్యతో సామాజిక మార్పు సాధ్యం అవుతుందని నమ్మే అక్షర అందుకోసం ఏం చేసింది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు  బీ చిన్నికృష్ణ దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న అక్షర మూవీ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో నందితతో పాటు కీలక పాత్రల్లో నటిస్తోన్న షకలక
శంకర్, సత్య, మధునందన్ పాల్గొంటున్నారు. వీరి పాత్రలు సినిమాలో హైలెట్ గా ఉంటాయంటున్నారు చిత్రయూనిట్‌. చివరి దశకు చేరుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. మే నెలలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement