అవును వాళ్లు ప్రేమించుకుంటున్నారు! | Did Jai-Anjali confirm their relationship? | Sakshi
Sakshi News home page

అవును వాళ్లు ప్రేమించుకుంటున్నారు!

Feb 11 2017 2:08 AM | Updated on Sep 5 2017 3:23 AM

అవును వాళ్లు ప్రేమించుకుంటున్నారు!

అవును వాళ్లు ప్రేమించుకుంటున్నారు!

అనూహ్యంగా కొన్ని సంఘటనలు, సందర్భాలు వాస్తవాలను బహిరంగపరుస్తాయనడానికి తాజా ఉదాహరణ నటుడు జయ్, నటి అంజలిల ప్రేమ వ్యవహారమే.

అనూహ్యంగా కొన్ని సంఘటనలు, సందర్భాలు వాస్తవాలను బహిరంగపరుస్తాయనడానికి తాజా ఉదాహరణ నటుడు జయ్, నటి అంజలిల ప్రేమ వ్యవహారమే. వీరిద్దరి ప్రేమ గురించి చాలా కాలంగా మీడియాలో కథలు కథలుగా ప్రచారం జరిగింది.అయినా తామిద్దరి మధ్య ఉన్నది మంచి స్నేహమేనని ఈ జంట తప్పించుకుంటూ వచ్చారు. తాజాగా నట దంపతులు సూర్య, జ్యోతిక కారణంగా జయ్,అంజలిల ప్రేమ గుట్టు బయట పడింది. జ్యోతిక నటించిన తాజా చిత్రం మగళీర్‌ మట్టుం చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. దీంతో ఆ చిత్ర నిర్మాత సూర్య ప్రమోషన్ కు శ్రీకారం చుట్టూరు. అందులో భాగంగా దోసెల పోటీని పెట్టారు.ముందుగా తన భార్య జ్యోతికకు దోసెలు వేయడం నేర్పించి, తను చుట్టిన దోసెలను ఆమెకు తినిపించిన ఫొటోలను వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు.

అదే విధంగా మీరు మీ భార్యలకు దోసెలు వేసి తినిపించి పోటీలో పాల్గొనాలంటూ పిలుపు నిచ్చారు. దర్శకుడు వెంకట్‌ప్రభు నటుడు జయ్‌కు ధైర్యం ఉంటే మీ లవర్‌ అంజలికి దోసెలు వేయడం నేర్పించి సూర్య దోసెల పోటీల్లో పాల్గొనాలని ఛాలెంజ్‌ విసిరారు. దాన్ని స్వీకరించిన జయ్‌ దోసెలు వేసి నటి అంజలికి తినిపించారు. ఈ ఫొటోలను తన వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు కూడా. దీంతో జయ్,అంజలిల మధ్య ప్రేమ ఎంత ఘూటుగా సాగుతుందో అర్థం అవడంలా?జయ్‌ దోసెలు వేసి అంజిలికి అందిస్తున్న ఫొటో దృశ్యాలిప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement