న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమె ఈ విషయాన్ని స్వయంగా శనివారం అర్ధరాత్రి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. గత మూడు రోజులగా జ్వరంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల హిమాలయాలకు వెళ్లినపుడు సామాజిక దూరం సహా.. కోవిడ్ నిబంధనలను పాటించినప్పటికీ కరోనా వైరస్ సోకింది అని చెప్పారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. (అయోధ్యకు వెళ్తా.. అక్కడికి మాత్రం వెళ్లను)
ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'నేను ప్రస్తుతం హరిద్వార్, రిషికేశ్ మధ్య ఉన్న వందేమాతరం కుంజ్ వద్ద క్వారంటైన్‌లో ఉన్నాను. నాలుగు రోజుల తర్వాత మరోసారి కోవిడ్ పరీక్ష చేయించుకుంటాను. పరిస్థితి ఇలాగే ఉంటే వైద్యులను సంప్రదిస్తాను' అంటూ ట్వీట్ చేసింది. (60 లక్షలకు చేరువలో కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment