గడువులోపే పోలవరం పూర్తి చేస్తాం: ఉమా భారతి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును గడువులోపే పూర్తిచేస్తామని, అవసరమైన మేర నిధులు అందిస్తామని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయిస్తే ఎప్పటికి పూర్తిచేస్తారని మీడియా ప్రశ్నించగా.. ‘పోలవరం ప్రాజెక్టు దేశానికి గర్వకారణం.
చట్టాన్ని అనుసరించి దానిని జాతీయ ప్రాజెక్టును చేశాం. ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేశాం. అథారిటీ అవసరాలు, డిమాండును బట్టి నిధులు అందజేస్తాం. నిర్మాణం పూర్తిచేస్తాం. నీతిఆయోగ్‌ను కూడా తరచుగా సంప్రదిస్తున్నాం. నిర్ధిష్ట సమయంలోపే పూర్తిచేస్తాం’ అని వివరించారు. ‘పోలవరం అంశంపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబుని పిలిచాం. గడువులోపు ఎలా పూర్తిచేయాలన్న అంశంపై ఆయనతో చర్చిస్తాం’ అన్నారు.