పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర నీటి వనరులు శాఖ మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారని టీడీపీ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఉమాభారతితో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అథారటీగా ప్రకటించాలన్న తమ విజ్ఞప్తిని ఉమాభారతి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
అలాగే కృష్ణా, తుంగభద్ర బోర్డులను ఏర్పాటుపై కూడా ఆమెతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితిలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించారు.