'మాటలు చెప్పను, చేసి చూపిస్తా'
న్యూఢిల్లీ: గంగా నది ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర నీటి వనరులు శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. మూడేళ్లలో గంగానదిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ అంశంపై విలేకరులు అడిగిన మిగతా ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆమె నిరాకరించారు.
గంగా నది ప్రక్షాళనకు సంబంధించి చాలా ప్రశ్నలు సంధించారని వాటకి తన చేతల ద్వారానే సమాధానం చెబుతానని అన్నారు. ఇలాంటి ప్రశ్నలు తన పనితీరుపై ప్రభావం చూపబోవని చెప్పారు. గంగా నది ప్రక్షాళనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.