తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రికి ఫిర్యాదు: దేవినేని
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న శ్రీశైలం జలవిద్యుత్ వివాదంలో జోక్యం చేసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. మంగళవారం ఉదయం ఆయన ఉమాభారతితో భేటీ అయ్యారు. అనంతరం విలేకర్లతో ఉమా మాట్లాడుతూ... శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి అయితే రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు వస్తాయని ఆమెకు వివరించినట్లు ఉమా తెలిపారు.