Srisailam hydro electric project
-
‘శ్రీశైలం’ ఘటనకు ఏడాది
సాక్షి, నాగర్‌కర్నూల్/ దోమలపెంట(అచ్చంపేట): టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్తు కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని శుక్రవారం నాటికి ఏడాది పూర్తయింది. ఈ సంఘటన టీఎస్ జెన్కో చరిత్రలో మాయనిమచ్చగా మిగిలింది. 2020 ఆగస్టు 20న అర్ధరాత్రి ఇక్కడి నాలుగో యూనిట్‌లోని ప్యానల్‌బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనలో ఐదుగురు ఇంజినీర్లు, ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు, మరో ఇద్దరు అమర్‌రాజ బ్యాటరీస్ కంపెనీకి చెందిన సిబ్బంది మరణించగా, మరో ఎనిమిది మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఉక్కిరిబిక్కిరై మృత్యువాత శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో నాడు అగ్రిప్రమాదం సంభవించి, దట్టమైన పొగలు వ్యాపించడంతో యూనిట్‌లోని ఉద్యోగులు, సిబ్బంది ఉక్కిరిబిక్కిరై తొమ్మిది మంది మరణించారు. వీరిలో డీఈ శ్రీనివాస్‌రావు (40), ఏఈ మర్సకట్ల పెద్ద వెంకట్రావ్ (46), ఏఈ మోహన్‌కుమార్ (33), ఏఈ ఉజ్మాఫాతిమా (27), ఏఈ సుందర్ (37), ప్లాంట్ అటెండర్ రాంబాబు (43), జూనియర్ ప్లాంట్ అంటెడర్ కిరణ్‌కుమార్ (30), అమరాన్ కంపెనీ ఉద్యోగులు వినేశ్‌కుమార్ (36), మహేశ్‌కుమార్ (38) మరణించారు. వీరంతా ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు వచ్చేందుకు యత్నించినా, దట్టమైన పొగతో ఊపిరి తీసుకునేందుకు వీలుపడని పరిస్థితి నెలకొనడంతో మరణించారు. పునరుద్ధరణ వైపు.. గతేడాది అక్టోబర్ 26న జలవిద్యుత్ కేంద్రంలోని 1, 2వ యూనిట్లలో పునరుద్ధరణ చేపట్టి విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత ఐదు నెలలకు 3, 5, 6వ యూనిట్లను సైతం పునరుద్ధరించి విద్యుదుత్పత్తి చేపట్టారు. ఈ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 646.56 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. కాగా 2021–22లో శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్తు కేంద్రానికి టీఎస్ జెన్కో విధించిన లక్ష్యం 1,450 మిలియన్ యూనిట్లు. మొత్తం ఆరు యూనిట్లకుగాను ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. కాగా అగ్నిప్రమాదం జరిగిన తర్వాత కేంద్రంలో ఇప్పటివరకు నాలుగు యూనిట్లను పునరుద్ధరించారు. 4వ యూనిట్ మాత్రమే పునరుద్ధరించాల్సి ఉంది. -
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవివాదంపై ఏపీ కేబినెట్ తీర్మానం
-
తెలంగాణతో జలవివాదం: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవివాదంపై ఏపీ కేబినెట్ దృష్టిసారించింది. రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ బుధవారం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా... శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరిని ఏపీ కేబినెట్ తప్పుబట్టింది. తెలంగాణ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం బుధవారం భేటీ అయింది. కాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం విషయంలో యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. జలాశయంలో కనీస డ్రాయింగ్ లెవల్‌కు నీటి మట్టం చేరుకోకపోయినప్పటికీ పూర్తి సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ -
‘ఇక్కడి ఆంధ్రా ప్రజలు ప్రశ్నించాలి’
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్‌లో ఉంటూ అన్ని వసతులు అనుభవిస్తున్న ఇక్కడి ఏపీ నేతలకు హైదరాబాద్ రాజధాని నీటి కష్టాలు పట్టవా?, ఇక్కడున్న ఆంధ్రా ప్రజలు కూడా ఏపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించాలి. పాలమూరు జిల్లా రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తూ కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పాదన అడ్డుకునేలా కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం దారుణం. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని కృష్ణా బోర్డు చెప్పడం సరికాదు. ఈ విషయంలో కేంద్రం ప్రేక్షక పాత్ర వహించడం తగదు. అన్యాయానికి గురవుతున్న తెలంగాణకు జాతీయ పార్టీలు అండగా ఉండాలి’ అని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, అంజయ్యయాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలసి సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అనేక అంశాల్లో కృష్ణా బోర్డు చోద్యం చూస్తోందని, ఏపీ చేపట్టిన అనేక అక్రమ ప్రాజెక్టులపై గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించినా కృష్ణా బోర్డు అమలు చేయడం లేదన్నారు. ప్రాణాలు పోయినా లెక్క చేయం. నీళ్ల దోపిడీతోపాటు సమైక్య పాలకులు తెలంగాణకు చేసిన అన్యాయాలపై ఇంకా వందేళ్లయినా మాట్లాడుతూనే ఉంటాం’అని మంత్రి అన్నారు. సమైక్య పాలనలో పాలమూరుకే ఎక్కువ నష్టం సమైక్య పాలనలో ఎక్కువ నష్టపోయింది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాత్రమేనని, పెండింగు ప్రాజెక్టులకు చిరునామాగా ఉన్నా జిల్లాను సస్యశ్యామలం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా ప్రజలతో ఉమ్మడిగా పోరాటం చేసి జల హక్కులు కాపాడుకుంటామన్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు పాలమూరు జిల్లా మీదుగా ప్రవహిస్తున్నా సమైక్య పాలకులు కరువు జిల్లాగా మార్చారని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఏపీ దురాలోచనతో పాలమూరు ప్రాజెక్టులకు అన్యాయం చేస్తోందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఏపీ జల దోపిడీని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని మహబూబ్‌నగర్ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. -
శ్రీశైలం ప్రమాదం; పూర్తిగా కాలిపోయిన 4వ యూనిట్
సాక్షి, శ్రీశైలం: జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు శ్రీశైలం ప్రమాద స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ, ‘దురదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరిగింది కానీ పెద్దగా ఆస్తి నష్టం జరుగలేదు. 4వ యూనిట్ లో నష్టం ఎక్కువగా జరిగింది. 1,2 యూనిట్స్ బాగానే ఉన్నాయి, 5 కూడా బాగానే ఉంది. 6వ యూనిట్ లో ప్యానెల్ దెబ్బ తింది. ఆరవ యూనిట్లో ప్రారంభమయిన మంటలు మిగతా యూనిట్లుకు అంటుకున్నాయి, నాల్గో యూనిట్ పూర్తిగా కాలిపోయింది. అందరూ అన్నట్లు వేల కోట్ల నష్టం జరుగలేదు, దురదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరిగింది. అదే చాలా బాధాకరం. త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభిస్తాం. విద్యుత్ ఉద్యోగుల భద్రతకు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం ప్లాంటులో జరిగిన అగ్ని ప్రమాదం లాంటి దుర్ఘటనలను మళ్లీ జరగకుండా ఏమి చేయాలో అన్నీ చేస్తాం. ఉద్యోగులు ఏమాత్రం అభద్రతా భావానికి లోనుకాకుండా మరింత అంకితభావంతో పనిచేసి, తెలంగాణ ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంస్థల ఉద్యోగులు యావత్ దేశం దృష్టిని ఆకర్షించే ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. తెలంగాణ ప్రజలకు విద్యుత్ ఉద్యోగులపై ఎంతో విశ్వాసం, అభిమానం ఉన్నాయి. వాటిని నిలుపుకోవడం ముఖ్యం. ప్లాంటులో ప్రమాదం జరిగి ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం పట్ల తెలంగాణ ప్రజలంతా దిగ్భాంతికి గురయ్యారు. ప్రజలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా మనమంతా మరోసారి పునరంకితమై పనిచేయాలి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. వారిని ఎలా ఆదుకోవాలనే విషయాన్ని చాలా తీవ్రంగా పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు. తన సోదరుడు శ్రీనివాసరావు మరణించాడన్న వార్త తెలిసిన తరువాత కూడా ఆయన ప్లాంటులో పర్యటించారు. తన సొంత అన్న మరణించిన దుఃఖాన్ని పంటి బిగువన దిగమింగుకుని తమకు ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రభాకర్ రావుకు పలువురు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన సోదరుడి మరణం పట్ల విచారం, సానుభూతి వ్యక్తం చేశారు. చదవండి: ట్విస్ట్ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం -
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రికి ఫిర్యాదు
-
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రికి ఫిర్యాదు: దేవినేని
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న శ్రీశైలం జలవిద్యుత్ వివాదంలో జోక్యం చేసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. మంగళవారం ఉదయం ఆయన ఉమాభారతితో భేటీ అయ్యారు. అనంతరం విలేకర్లతో ఉమా మాట్లాడుతూ... శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి అయితే రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు వస్తాయని ఆమెకు వివరించినట్లు ఉమా తెలిపారు.