సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవివాదంపై ఏపీ కేబినెట్ దృష్టిసారించింది. రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ బుధవారం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా... శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరిని ఏపీ కేబినెట్ తప్పుబట్టింది. తెలంగాణ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం బుధవారం భేటీ అయింది.
కాగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం విషయంలో యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. జలాశయంలో కనీస డ్రాయింగ్ లెవల్‌కు నీటి మట్టం చేరుకోకపోయినప్పటికీ పూర్తి సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment