ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నాయకురాలు ఉమాభారతి అన్నారు.
ఝాన్సీ: ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నాయకురాలు ఉమాభారతి అన్నారు. చట్టాలను ఉల్లంఘించి వాద్రా వేల కోట్లు కూడబెట్టారని ఆమె ఆరోపించారు. రాబర్ట్ వాద్రా పేరు చెబితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వణికిపోతున్నాయని ఆమె ఎద్దేవా చేశారు.
తన చేతికి అధికారం వస్తే సోనియా అల్లున్ని జైలుకు పంపుతానని చెప్పారు. ఈనెలలో రెండోసారి ఉమాభారతి ఈ ప్రకటన చేశారు. యూపీఏ ప్రభుత్వం అండతో రాబర్ట్ వాద్రా అనేక అక్రమాలకు పాల్పడ్డారని తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనను జైలుకు పంపిస్తామని ఆమె అన్నారు. యూపీలోని ఝాన్సీ లోకసభ నియోజక వర్గం నుంచి ఉమాభారతి పోటీ చేస్తున్నారు.